Home /News /telangana /

RAJANNA SIRCILLA EVEN AFTER 16 YEARS MID MANER VICTIMS HAS NOT RECEIVED COMPENSATION FROM THE TELANGANA GOVERNMENT RKH NJ PRV

Mid maneru: ఏళ్లు గడుస్తున్నా అందని పరిహారం.. మొరపెట్టుకుంటున్న మిడ్‌మానేరు బాధితులు

పరిహారం

పరిహారం కోసం బాధితుల ఎదురుచూపులు

ఒకరికి పని కల్పించే పరిస్థితి నుంచి మరొకరి దగ్గర కూలీగా మారే దుస్థితి మిడ్‌ మానేరు నిర్వాసితులకు ఏర్పడింది. పరిహారం అందక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఏళ్ల తరబడి పరిహారం ఎదురుచూస్తూనే ఉన్నా..ఫలితం మాత్రం శూన్యం

    (K.Haribabu, News18, Rajanna siricilla) 

    Mid maneru: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ (Mid maneru Project)లో 13 గ్రామాల ప్రజల త్యాగ ఫలితంగా శ్రీ రాజరాజేశ్వరి జలాశయం ఏర్పడింది. జలాశయం నిర్మాణానికి  (For the construction of the reservoir) వెలకట్టలేని త్యాగాలను చేసిన ఆ గ్రామాల ప్రజలకు (Villagers) ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న కాస్త వ్యవసాయ భూమి (land), ఇండ్లు (House) మిడ్ మానేరు జలాశయంలో ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పోవడంతో రోడ్డున పడ్డారని ప్రజలు చెబుతున్నారు.

    హామీలు మర్చిపోయిన ప్రభుత్వం..అవస్థలు పడుతున్న ప్రజలు

    సీఎం కేసీఆర్ (CM KCR) నాలుగు లక్షల రూపాయలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పారని,ఆ హామీని మర్చిపోయారని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి మిడ్‌మానేరులో సర్వం కోల్పోయిన ముంపు బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. 2006లో ప్రారంభమైన మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణం 2017లో పూర్తయింది. వేములవాడ (VemulaWada) అర్బన్ మండలం పరిధిలోని శభాష్ పల్లి, రుద్రవరం,అనుపురం, కోదురుపాక, చీర్లవంచ, నీలోజి పల్లె, ఆరెపల్లి గ్రామాల ప్రజల వ్యవసాయ భూమి లేకపోవడంతో అక్కడే ఉన్న యువత ,పెద్దలు ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నారు.

    ఒకప్పుడు సొంతభూముల్లో వ్యవసాయం..ఇప్పుడు కూలీలుగా..!

    ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలతో పాటు ఓ ఫ్లాట్ ఇస్తానని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు తమకు పరిహారం అందలేదని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలు గడుస్తున్నా తమకు పరిహారం అందక పోవడం పట్ల వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒకప్పుడు తాను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వారిమని, ఇప్పుడు ఇతరుల పొలాల్లోకి మేము కూలీలుగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని వివరించారు.

    అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకున్నాం..వడ్డీలు కట్టలేక చస్తున్నాం..!

    పరిహారం (Compensation) అందకపోవడంతో ఉండేందుకు ఇల్లు సైతం లేక అప్పులు తీసుకువచ్చి ఇల్లు నిర్మించుకుంటే అప్పుల వడ్డీలు కుప్పలుగా తయారయ్యాయని ప్రజలు వాపోతున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు 700 వరకు పరిహారం అందక ప్రజలు బాధపడుతున్నారని స్థానికులు,బాధితులు చెబుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా చేస్తామంటూ మాట దాటివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం అందక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఎప్పుడు పరిహారం అందిస్తాయో తెలియక,కొండంత ఆశతో కళ్లు కాయలు కాస్తున్న ఎదురుచూస్తున్నామని తెలిపారు.

    దయచేసి ఆదుకోండి

    తమ బతుకులు చాలా దీన పరిస్థితుల్లోకి వెళ్లాయని, ఉపాధి లేక యువకులు గల్ఫ్ బాట పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి మిడ్‌మానేరు లో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి కల్పించే విధంగా కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Farmers, Local News, Siricilla

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు