Home /News /telangana /

RAJANNA SIRCILLA DUE TO POWER CUTS FARMERS FIND IT DIFFICULT TO CULTIVATE RICE IN NAGARKURNOOL DISTRICT ABH BRV RKH

Rajanna Sircilla: విద్యుత్ లేక ఆడని వ్యవసాయ బోర్లు.. నీరు లేక ఎండిపోతున్న వరి పొలాలు!..

సమయానికి నీరందక ఎండిపోయిన వరి చేను

సమయానికి నీరందక ఎండిపోయిన వరి చేను

వ్యవసాయం కోసం 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రోజుకు మూడు, నాలుగు గంటలే కరెంటు ఉండటంతో వ్యవసాయానికి బోర్లు నుంచి నీరందక రైతులు ఇక్కట్లు పడుతున్నారు

    (K.Haribabu, News 18, Rajanna Sircilla)

    వ్యవసాయం కోసం 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రోజుకు మూడు, నాలుగు గంటలే కరెంటు ఉండటంతో వ్యవసాయానికి బోర్లు నుంచి నీరందక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. వానాకాలం రావడంతోనే దుక్కి దున్ని నాట్లు వేసిన రైతులు ప్రస్తుతం విద్యుత్ అంతరాయాలు కారణంగా బోర్లు ఆడకపోవడంతో వరి పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో బోర్ల కింద వరి సాగు చేస్తున్న రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. గత యాసంగీ నుంచి 24 గంటల విద్యుత్ పంపిణీలో కోత విధించి రాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు, మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 15 గంటలు మాత్రమే విద్యుత్ ఇచ్చేవారు. ఇప్పుడు ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 - 4 గంటల పాటే విద్యుత్ ఉంటుందని వీర్నపల్లి రైతులు చెబుతున్నారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కరెంట్ పోతుందని, మాటిమాటికి పవర్ కట్ కావడంతో... నీరు ఒక మడి నుంచి మరో మడికి వెళ్లడం లేదంటూ రైతులు వాపోతున్నారు. నాటు వేసిన పొలాలు ఎండిపోతుండగా, నాట్లు వేయని పొలాల్లో సాగు చేద్దామా..! వద్దా..?అనే సందిగ్ధం రైతుల్లో నెలకొంది. ఈ సమస్యను రైతులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఆ పొలాల పరిధిలోని సబ్ స్టేషన్ ఓవర్ లోడ్ అవుతుందని అధికారులు చెబుతున్నారని రైతులు పేర్కొన్నారు.

    ఆందోళనలో రైతులు:
    'మా గ్రామంలోని పంట పొలాలకు మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. అంతకుముందు 9 గంటల కరెంటు ఇచ్చారు. ఇప్పుడేమో మూడు గంటల పాటే విద్యుత్ ఇస్తున్నా అందులోనే కోతలు విధిస్తున్నారు. దీంతో వరి నాట్లు వేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయని" ఎర్రగడ్డ తండ రైతు భూక్యా పర్శురాములు ఆవేదన వ్యక్తం చేశాడు. కరెంట్ లేక రెండు ఎకరాల పొలం కూడా నీరు పారడం లేదని రైతు నేరళ్ళ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. నాట్లు వేసిన వరి మడులు నిండడం లేదని..ఇలా అయితే పొలాలు ఎండిపోతాయని రైతు ఆవేదన చెందాడు. ప్రభుత్వం స్పందించి కనీసం రోజుకు 18 గంటలైనా కరెంటు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

    12 గంటల కరెంట్ ఇస్తున్నాం: ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండల సెస్ ఏఈ దివ్య
    ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయానికి కరెంట్ ఇస్తున్నామని, రోజుకు 12 గంటల కరెంటు ఇస్తున్నట్లు సెస్ ఏఈ పేర్కొన్నారు. వీర్నపల్లి మండలంలో పంట పొలాల పరిధిలోని సబ్ స్టేషన్ ఓవర్ లోడ్ కారణంగా కరెంట్ పోతుందని... రెండు రోజుల్లో సమస్య పరిష్కరించి నిరంతరాయంగా కరెంటు సరఫరాకు చర్యలు తీసుకుంటామని దివ్య తెలిపారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: ELectricity, Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు