Home /News /telangana /

RAJANNA SIRCILLA DUE TO LACK OF MAINTENANACE OPEN GYMS ARE NOT USEFUL FOR PEOPLE IN VEMULAWADA RKH BRV PRV

Rajanna sircilla: రాజన్న సన్నిధిలో సమస్యలు పట్టవా? సౌకర్యాలు ఏర్పాటుచేయడం వరకే అధికారుల పని.. నిర్వహణ దేవుడెరుగు..

gym

gym items

ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ ప్రకటనలతో హోరెత్తిస్తున్న అధికారులు..ఆ సౌకర్యల నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. నగరాలూ, పట్టణాల్లో ప్రజల కోసం పార్కులు, ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేసిన అధికారులు వాటి నిర్వహణలో మాత్రం అశ్రద్ధ వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    (K. Haribabu, News18, Rajanna siricilla) 

    ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ ప్రకటనలతో హోరెత్తిస్తున్న అధికారులు..ఆ సౌకర్యల నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. నగరాలూ, పట్టణాల్లో ప్రజల కోసం పార్కులు, ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేసిన అధికారులు వాటి నిర్వహణలో మాత్రం అశ్రద్ధ వహిస్తున్నారు. దీంతో ఆ పరికరాలు ప్రజలకు పనికిరాకుండా నిరుపయోగంగా మారుతున్నాయి. రాజన్నసిరిసిల్ల (rajanna siricilla) జిల్లా వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డు, రెండవ బైపాస్ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లు పర్యవేక్షణ లోపంతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. పరికరాలు పాడైపోయి నిరుపయోగంగా మారాయి. స్థానిక మున్సిపల్ అధికారులు స్పందించి పాడైపోయిన జిమ్ (Gym) పరికరాలకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని వ్యాయామ ప్రియులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.

    పట్టణ ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్..

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ. లక్షలు వెచ్చించి వేములవాడ (Vemulawada) పరిధిలో పార్కులు తీర్చిదిద్ది ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. పట్టణాభివృద్ధిలో భాగంగా అధికారులు ఇలా తగిన సౌకర్యాలు కల్పించడంతో పట్టణ వాసులు సైతం హర్షం వ్యక్తం చేశారు. కానీ, పట్టణ వాసుల సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. జిమ్‌లో పరికరాలు నిర్వహణకు నోచుకోక, పర్యవేక్షణా లోపంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయని పట్టణ ప్రజలు చెబుతున్నారు. ఓపెన్ జిమ్ పరిస్థితిపై గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం అయిందని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి జిమ్ పరికరాలకు మళ్ళీ కొత్త రూపురేఖలు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ విషయంపై స్థానిక మున్సిపల్ కమిషనర్‌ను న్యూస్ 18 వివరణ కోరగా, త్వరలోనే వాటిని బాగు చేస్తామని తెలిపారు.

    ఓపెన్ జిమ్ దుస్థితి చూసి వెనుదిరిగి వెళ్ళిపోతున్న పట్టణ వాసులు..

    వేములవాడ పరిధిలో ఉన్న ఓపెన్ జిమ్‌లలో (Open gyms) వ్యాయామం చేసేందుకు..ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్దలు, పిల్లలు, యువతీయువకులు వస్తున్నారు. అయితే పాడైన పరికరాలను చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఓపెన్ జిమ్‌లో పాడైపోయిన పరికరాలతో కొందరు చిన్నారులు వ్యాయామాలు చేస్తున్నారు. అయితే అధికారులు స్పందించి పాడైన పరికరాలను మరమ్మతులు చేయడమో, లేక వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవచ్చని స్థానిక ప్రజలు వాపోతున్నారు. మూలవాగును ఆనుకొని ఉన్న ఓపెన్ జిమ్ వద్ద ఏర్పాటు చేసిన సైడ్ వాల్ రైలింగ్ బలంగా లేకపోవడంతో కూలిపోయి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని, అధికారులు దృఢమైన సైడ్ వాల్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

    అపరిశుభ్రంగా జిమ్ పరిసరాలు:
    ఓపెన్ జిమ్ ప్రాంతాలను ప్రతిరోజూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల చేత శుభ్రం చేయించాలని, తద్వారా ఓపెన్ జిమ్ పరిశుభ్రంగా మారుతుందని వ్యాయామ ప్రియులు అంటున్నారు. పార్కులకు ఆనుకుని ఉన్నా ఓపెన్ జిమ్ పరిసర ప్రాంతాలు సైతం దుర్గంధం వెదజల్లుతున్నాయని, మున్సిపల్ అధికారులు స్పందించి పరిసర ప్రాంతాలను బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ఓపెన్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు అధికారులు కృషి చేయాలని, తద్వారా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని వేములవాడ పట్టణ వాసులు వాపోతున్నారు. గతంలో నాటిన మొక్కలకు నిర్వహణ కొరవవడంతో ఓపెన్ జిమ్ పరిసరప్రాంతాలు చెట్లు, మొక్కలు లేక కళావిహీనంగా కనిపిస్తున్నాయి. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగానైన ఓపెన్ జిమ్ ప్రాంతాల్లో మొక్కలు నాటాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Local News, Siricilla, Vemulawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు