హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rahul Hegde: సెల్యూట్ టు ఎస్పీ.. మరోసారి పెద్దమనసు చాటుకున్న రాహుల్ హెగ్డే.. యువకుడి ప్రాణాలు కాపాడేందుకు..

Rahul Hegde: సెల్యూట్ టు ఎస్పీ.. మరోసారి పెద్దమనసు చాటుకున్న రాహుల్ హెగ్డే.. యువకుడి ప్రాణాలు కాపాడేందుకు..

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపదలో ఉన్నవారికి ఆ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అండగా నిలుస్తున్నారు. నేనున్నానంటూ సాయం అందిస్తున్నారు.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపదలో ఉన్నవారికి ఆ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అండగా నిలుస్తున్నారు. నేనున్నానంటూ సాయం అందిస్తున్నారు.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపదలో ఉన్నవారికి ఆ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అండగా నిలుస్తున్నారు. నేనున్నానంటూ సాయం అందిస్తున్నారు.

  తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపదలో ఉన్నవారికి ఆ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అండగా నిలుస్తున్నారు. నేనున్నానంటూ తోడుగా నిలుస్తున్నారు. కరోనా విజృంభణ సమయంలో జిల్లాలోని వలస కార్మికులకు నిత్యావసరాలు అందించి.. వాళ్లకు ఇబ్బంది కలగకుండా తన వంతు సాయం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వారి అవసరాలను తీర్చేందుకు కృషి చేశారు. అలాగే కొన్ని నెలల కిందట తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన ఇద్దరు ఆడపిల్లల గురించి మీడియా ద్వారా తెలుసుకున్న రాహుల్ హెగ్డే చలించిపోయారు. వారికి ఎంతో కొంత డబ్బు సాయం చేసి చేతులు దులుపుకోకుండా అన్నగా అండగా నిలిచారు. వాళ్లకు స్వయంగా ఇల్లు కట్టించి ఆశ్రయం కల్పించారు. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా ఎస్పీ రాహుల్ హెగ్డేను అభినందించారు.

  తాజాగా రాహుల్ హెగ్డే మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం నాగారం గ్రామంలోని మ్యాకల లక్ష్మి, రామయ్య దంపతులపెద్ద కొడుకు రాహుల్ (27) అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. నిత్యం ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే పెద్ద మనసు చాటుకున్నారు. ఆ కుటుంబానికి తన సొంత డబ్బులు రూ. 50వేలు అందజేశారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. హైదరాబాద్ లోని కొందరు డాక్టర్ లతో మాట్లాడి మంచి వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వెంటనే హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఎవరికి ఏ ఆపద వచ్చినా స్వయంగా ఎస్పీ ముందుండి సహాయం చేయడం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


  గతంలో కూడా ఓ పాప వైద్యం కోసం రాహుల్ హెగ్డే తనవంతు సాయం అందించారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తాటిపల్లి భానుచందర్, దివ్యలకు 8నెలలోనే పాప పుట్టింది. ఆరోగ్యం బాగాలేకపోవడంతో కరీంనగర్ లో చికిత్స జరుగుతుంది. చాలాపేద కుటుంబం పుట్టిన పాప ఆరోగ్యం బాగా లేకపోవడంతో వెంటనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స అవసరం కోసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు అయితే పాప దక్కుతుందని డాక్టర్స్ చెప్పారు. వారి దగ్గర అంత డబ్బులు లేకపోవడం తో చేసేదేమీ లేక సోషల్ మీడియా ద్వారా ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఘటనను సోషల్ మీడియా లో చూసి స్పందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, తక్షణ సహాయం కింద రూ.50,000 నగదును అందించారు.

  Rajanna Sircilla District, SP Rahul Hegde, SP Rahul Hegde Help, SP Rahul Hegde Donates 50000 thousands, రాజన్న సిరిసిల్ల, ఎస్పీ రాహుల్ హెగ్డే, సాయం అందించిన రాహుల్ హెగ్డే
  గతంలో ఎస్పీ రాహుల్ హెగ్డేను అభినందించిన డీజీపీ

  భానుచందర్‌ను ఎస్పీ ఆఫీస్ కి పిలిచి నగదును అందించారు. మిగిలిన డబ్బులను కూడా అందిస్తా అని భరోసా ఇచ్చారు. దీంతో ఆ తల్లితండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. వారికి ఆర్థిక సాయం చేయడం మాత్రమే కాకుండా ఎస్పీ రాహుల్ హెగ్డే స్వయంగా డాక్టర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. పాపకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

  First published:

  Tags: Sircilla, Telangana

  ఉత్తమ కథలు