హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత ఫిజికల్ ట్రైనింగ్

Rajanna Siricilla: పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత ఫిజికల్ ట్రైనింగ్

X
అభ్యర్థులకు

అభ్యర్థులకు ట్రైనింగ్

Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలో పోలీస్ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

K.Haribabu,News18, Rajanna siricilla

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలో పోలీస్ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రిలిమినరీ పోలీస్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈవెంట్స్ లో మెరిట్ సాధించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉదయం, సాయంత్రం ఫిజికల్ శిక్షణ నిమిత్తం గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేములవాడ డి.ఎస్.పి నాగేంద్ర చారి అభ్యర్థులకు విలువైన సూచనలు సలహాలు అందజేసి వారికి మోటివేషన్ అందించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ ప్రాంతంలో పోలీస్ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు గ్రౌండ్ నందు ఉచితంగా ఫిజికల్ శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రస్తుతం 150 మంది అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాల కోసం కఠోర శిక్షణ పొందుచున్నారు. ఈ శిక్షణను వేములవాడ సబ్ డివిజన్ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ శిక్షణ శిబిరంను వేములవాడ డిఎస్పీ సందర్శించి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.

ఈ శిక్షణలో పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్లు, లాంగ్ జంప్ షాట్ పుట్ నందు కూడా డిఎస్పీ మెలకువల గురించి అభ్యర్థులకు వివరించారు. ఈ సందర్బంగా డిఎస్పీ నాగేంద్ర చారీ మాట్లాడుతూ..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు శిక్షణ శిబిరాన్ని సందర్శించి అభ్యర్థులకు పలు సూచనలు చేసినట్టు వెల్లడించారు. అదేవిదంగా ఇట్టి శిబిరాన్ని ఉపయోగించుకొని యువతీ, యువకులు పోలీస్ ఉద్యోగాలు పొంది సమాజానికి రక్షణ,సేవ చేయాలని అభ్యర్థులకు సూచించారు. ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ శిబిరాన్ని కొనసాగిస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్ ని ప్రత్యేకంగా అభినందించారు.

వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి.. మిమ్మళ్ళి చూస్తే నన్ను నేనే చూసుకున్నట్లు ఉందని అన్నారు. మనందరి టార్గెట్ ఒక్కటే..జాబ్ అని, పోలీస్ అభ్యర్థులను మోటివేట్ చేశారు. ప్రతిరోజు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ.. పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఇలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కష్టంతో కాకుండా ఇష్టపడి లక్ష్యాలను నిర్ణయించుకుని చేదించాలని అన్నారు.

అభ్యర్థులు ఈవెంట్స్ కు ఫిజికల్ శిక్షణతో పాటు మెంటల్గా సైతం ప్రిపేర్ అవ్వాలని సూచించారు. ఈవెంట్స్ లో చిన్న చిన్న టెక్నిక్స్ తో మెరిట్ సాధించవచ్చని చెప్పారు. మనం అందరం టార్గెట్ కంటే ఎక్కువ గోల్ పెట్టుకుని ముందుకెళ్లాలని, అప్పుడప్పుడు టార్గెట్లు మిస్ అవుతాయని, వాటిని అధిగమిస్తూ అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో,మొక్కుకొవని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు. ఈవెంట్స్ లో మెరిట్ సాధించేందుకు గ్రౌండ్ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని, యోగ సైతం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు