హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: ప్రభుత్వ ఉద్యోగినా.. మజాకా.. రూ. 8 లక్షల డీజిల్ తాగేసిన మునిసిపల్ సిబ్బంది

OMG: ప్రభుత్వ ఉద్యోగినా.. మజాకా.. రూ. 8 లక్షల డీజిల్ తాగేసిన మునిసిపల్ సిబ్బంది

వేములవాడ మునిసిపల్ కమిషనర్

వేములవాడ మునిసిపల్ కమిషనర్

డీజిల్ కొనుగోలు పేరుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని బొక్కేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Haribabu, News18, Rajanna Sircilla) 

  వేములవాడ మునిసిపల్ కార్యాలయం (Vemulawada Municipal Office)లో ఉన్నతాధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. డీజిల్ కొనుగోలు (Diesel Purchase) పేరుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని బొక్కేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. వేములవాడ మునిసిపల్ పరిధిలోని 28 వార్డుల నుంచి ప్రతి రోజూ చెత్త సేకరణ నిమిత్తం పలు రకాల వాహనాలు (Vehicles) వినియోగిస్తున్నారు. 7 ట్రాక్టర్లు, 25 ఆటో ట్రాలీలు పరిశుభ్రత కోసం ఒక ఫ్రంట్‌బ్లేడ్‌ ట్రాక్టర్‌, మొక్కలకు నీళ్లు పోసెందుకు మరో రెండు వాటర్ ట్యాంకర్ వాహనాలను మునిసిపల్ సిబ్బంది (Municipal staff) వినియోగిస్తున్నారు. అంచనా ప్రకారం.. ఈ వాహనాల కోసం రోజు వారీగా దాదాపు 150 లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుండగా నెలకు దాదాపు 4,500 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. ఇందుకు గానూ రూ. 4.50 లక్షల వరకు నెల ఖర్చు వస్తుంది.

  డీజిల్‌ వినియోగం, కొనుగోలులో అవినీతి:

  కాగా మునిసిపల్ వాహనాల్లో డీజిల్ వినియోగం నిమిత్తం గత 5 నెలల్లో ఖర్చు చేసిన మొత్తాన్ని పరిశీలించిన అధికారులు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఏడాది మార్చిలో రూ. 5.5 లక్షలు, ఏప్రిల్‌లో రూ. 6.21లక్షలు, మే నెలలో రూ. 6.11 లక్షలు, జూన్‌లో రూ. 7.72 లక్షలు, రూ. జూలైలో 5.40, ఆగష్టులో రూ. 4 లక్షల చొప్పున డీజిల్‌ కోసం ఖర్చు చేసినట్లు రికార్డులు చూపారు మునిసిపల్ అధికారులు.

  ఈ బిల్లులు చూసి మునిసిపల్ కమిషనర్‌ శ్యామ్ సుందర్ రావు (Municipal Commissioner Shyam Sundar Rao) అవాక్కయ్యాడు. దీంతో నెల వారీగా ఏ మేరకు డీజిల్‌ వినియోగించారో రికార్డులు చూపాలని ఆదేశించారు. కానీ రికార్డులను చూపించడంలో సదరు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నిర్లక్ష్యం వహించడంతో... మునిసిపల్ కమిషనర్ విషయాన్నీ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్ కార్యాలయం మునిసిపల్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. సుమారు 8 వేల లీటర్ల వరకు డీజిల్‌ దుర్వినియోగమైనట్లు గుర్తించి, శాఖాపరమైన విచారణ చేపడుతున్నారు. ఆగష్టులో నేరుగా నగదు చెల్లించి డీజిల్‌ కొనుగోలు చేయగా..కేవలం రూ. 4 లక్షల వరకే ఖర్చయినట్లు కమిషనర్‌ వెల్లడించారు.

  Tahsildar Sujatha died: వివాదాస్పద ‘‘షేక్​పేట మాజీ తహసీల్దార్ సుజాత’’​ మృతి.. పూర్తి వివరాలివే..

  వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో డీజిల్ గోల్ మాల్ పై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. మున్సిపల్ అధికారుల తీరుపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. అక్రమాలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

  చర్యలు తీసుకుంటాం: వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ రావు

  మునిసిపాలిటీలోని శానిటరీ విభాగంలో దుర్వినియోగమైన డీజిల్‌ వ్యవహారంలో ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని కమిషనర్ శ్యాంసుందర్ రావు పేర్కొన్నారు. "నెల రోజులకు సుమారు 4500 లీటర్ల డీజిల్‌ అవసరమవుతుంది. ఇందుకోసం రూ. 4 - 4.50 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, ఒక్కో నెల ఒక్కో చెల్లింపుతో బిల్లులు రాశారు. దాదాపు రూ. 8 లక్షలు వరకు దుర్వినియోగమైనట్లు ప్రాథమిక అంచనాగా గుర్తించాము" అని కమిషనర్ పేర్కొన్నారు. పైఅధికారుల ఆదేశాలతో సదరు ఉద్యోగిపై కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Diesel price, Municipal Workers, Siricilla, Vemulawada

  ఉత్తమ కథలు