హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Sircilla: క్రెడిట్ కార్డు కోసమని కాల్ చేసి... లైవ్‌లో బ్యాంకు ఖాతా ఖాళీ చేశారు

Rajanna Sircilla: క్రెడిట్ కార్డు కోసమని కాల్ చేసి... లైవ్‌లో బ్యాంకు ఖాతా ఖాళీ చేశారు

క్రెడిట్​

క్రెడిట్​ కార్డు స్కాం

మనతో ఫోన్ మాట్లాడుతుండగానే మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు దోచుకునేంతలా. అవునండి...మీరు చూసింది నిజమే. మనకు ఫోన్ కాల్ చేసే అపరిచిత వ్యక్తి.. మనతో ఫోన్ మాట్లాడుతూనే మనకు తెలియకుండానే బ్యాంకు వివరాలు తీసుకుని డబ్బులు కాజేస్తాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Haribabu, News18, Rajanna Sircilla)


  సైబర్ క్రైమ్ (Cyber crime) నేరాలు పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే మనతో ఫోన్ మాట్లాడుతుండగానే మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు (Money) దోచుకునేంతలా. అవునండి.. మీరు చూసింది నిజమే. మనకు ఫోన్ కాల్ (Phone call) చేసే అపరిచిత వ్యక్తి.. మనతో ఫోన్ మాట్లాడుతూనే మనకు తెలియకుండానే బ్యాంకు వివరాలు తీసుకుని డబ్బులు కాజేస్తాడు. క్రెడిట్ కార్డు (Credit card) ఇస్తామంటూ ఫోన్ కాల్ చేసిన ఓ అపరిచిత వ్యక్తి... బాధితుడి బ్యాంకు ఖాతా (Bank account) నుంచి నగదు దోచుకోవడం సంచలనంగా మారింది. ఈ సంఘటన గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది.


  కొత్తపల్లికి చెందిన మొటాటి శ్రీనివాస్‌కు ఆగష్టు 24న క్రెడిట్ కార్డు ఇస్తామంటూ ఓ ప్రైవేటు బ్యాంకు ప్రతినిధి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే మొదట ఆ వ్యక్తి మాటలను నమ్మని శ్రీనివాస్ ఫోన్ పెట్టేశాడు. మళ్లీ మళ్లీ ఫోన్ చేసి తాను ఓ బ్యాంకు ఉద్యోగినంటూ తనను నమ్మాలని చెబుతూ శ్రీనివాస్ వాట్సాప్‌కు బ్యాంకు ఐడీ కార్డు, ఆధార్ కార్డులను పంపించాడు. వీటితో పాటుగా ఓ లింక్ కూడా పంపించాడు.  అది నమ్మిన శ్రీనివాస్ ఆ లింక్‌ను ఒక్కసారి ఓపెన్ చేయడంతో తన బ్యాంకు ఖాతా నుంచి సుమారు రూ.1.40 లక్షలు వివిధ దఫాల్లో డ్రా అయినట్లు మెసేజీలు వచ్చాయి. తనతో ఓ వైపు ఫోన్ కాల్ మాట్లాడుతుండగానే ఇలా బ్యాంకు నుంచి నగదు మాయమవడంతో మోసపోయానని గ్రహించిన శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించాడు.


  Aasara Pensions: దుర్మార్గుడు: పింఛన్ ఇప్పిస్తానంటూ నిస్సహాయురాలి వద్ద డబ్బులు దండుకున్నాడు


  తనకు ఓటీపీలు (OTP) రాలేదని, అపరిచిత వ్యక్తికి సీవీవీ నంబర్ (CVV Number) కూడా చెప్పలేదని అయినా బ్యాంకు నుంచి నగదు డ్రా అయ్యిందని బాధితుడు శ్రీనివాస్ వాపోయాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రంలో అవగాహన కల్పిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, అపరిచితులు పంపిన లింక్స్‌ను ఓపెన్ చేయవద్దని చెబుతున్నారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.నెంబర్ చెప్పకుండానే సైబర్ నేరగాళ్లు నగదును అపహరించడం పట్ల బాధితుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CYBER CRIME, Local News, Rajanna, Siricilla

  ఉత్తమ కథలు