Home /News /telangana /

RAJANNA SIRCILLA CRUMBLING WORKS IN CHECK DAM CONSTRUCTION IN RAJANNASIRICLLA DISTRICT SNR RKH BRV

Rajannasircilla: మంత్రి కేటీఆర్ ఇలాకాలో నాసిరకం పనులు: చెక్ డ్యామ్ నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు

(నాసిరకం

(నాసిరకం నిర్మాణం)

Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రామలక్ష్మణపల్లి గ్రామం వద్ద మానేరు వాగుపై చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్థానిక బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షానికి కింది నుండి లీకేజ్ అవుతుందని ఆరోపించారు.

ఇంకా చదవండి ...
    (K.Haribabu,News18, Rajanna siricilla)
    రూ. కోట్లు ఖర్చు పెట్టి సాగు నీటి ప్రాజెక్టులు నిర్మిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దీర్ఘ కాలంలో వ్యవసాయానికి నీరు అందేలా ఎంతో ముందు చూపుతో నీటి ప్రాజెక్టులు చేపడుతుంది ప్రభుత్వం. అయితే టెండర్లు దక్కించుకుంటున్న కొందరు గుత్తేదారులు మాత్రం ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలోకి తొక్కి, ఏమాత్రం నాణ్యత లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించడం విమర్శలకు తావిస్తుంది.

    మానేరు వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణంలో నాణ్యత లోపం:
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రామలక్ష్మణపల్లి గ్రామం వద్ద మానేరు వాగుపై చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్థానిక బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. చెక్ డ్యాం సందర్శించిన అనంతరం బిజెపి నాయకులు క్రాంతి మాట్లాడుతూ దాదాపు రూ. ఆరు కోట్ల అంచనా విలువతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చి నిర్మించడంతో, చిన్నపాటి వర్షానికి కింది నుండి లీకేజ్ అవుతుందని ఆరోపించారు. నాసిరకం చెక్ డ్యాం నిర్మించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బేస్ నుండి కాంక్రీట్ పోయకుండా కేవలం మూడు మీటర్ల లోతు నుండి కాంక్రీట్ పోసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నరని బీజేపీ నేత ఆరోపించారు. ఇటీవల కురిసిన చిన్న పాటి వర్షానికే చెక్ డ్యాం నుంచి నీరు లీకవడం ప్రారంభించిందని, పెద్ద వర్షాలకు ఇలాంటి నాసిరకం చెక్ డ్యాంలు ఎలా నిలుస్తాయని బీజేపీ నేత క్రాంతి ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ అధిక మొత్తంలో నిధులు తెస్తున్నా, జిల్లా కేంద్రంలోని కిందిస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేస్తూ.. నాసిరకం పనులు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

    ఇది చదవండి : నిన్న పనోడు.. నేడు ఓనరు : 'దళిత బంధు' పథకం తెచ్చిన మార్పు ఇదే!



    మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించాలి:
    రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. నాసిరకం పనులు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, రైతులు కోరుతున్నారు. చెక్ డ్యాం నిర్మాణంలో డొల్లతనం బయటపడ్డా, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నీరు లీక్ అవుతున్న చెక్ డ్యాంను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పటిష్టంగా మరమ్మతులు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

    ఇది చదవండి: పేదవాడి సొంతింటి కల నెరవేరేదేప్పుడు?: ములుగు జిల్లాలో అసంపూర్తిగా డబల్ బెడ్‌రూం ఇళ్లు



    కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ నేత
    మానేరు వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణ పనుల్లో ప్రమాణాలు పాటించకపోవడం పై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ స్పందించి, నాసిరకమైన అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల లైసెన్సులు రద్దు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి పనులను మంత్రి క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టాలని, నాణ్యమైన అభివృద్ధి పనులు జరిగేలా చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన స్పందించి నాణ్యమైన అభివృద్ధి పనులు చేపట్టే విధంగా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.

    ఇది చదవండి : నకిరేకల్‌లో తారస్థాయికి చేరిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య పంచాయితీ ..నెక్ట్స్ ఎట్లుంటదో


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Siricilla

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు