హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Sircilla: మద్యం తాగొద్దన్నందుకు భార్య గొంతు కోసిన భర్త: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరాలు

Rajanna Sircilla: మద్యం తాగొద్దన్నందుకు భార్య గొంతు కోసిన భర్త: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరాలు

సిరిసిల్ల క్రైమ్​

సిరిసిల్ల క్రైమ్​

మద్యం మానేయమన్నందుకు భార్య గొంతు కోశాడు ఓ కసాయి భర్త. ఇతర జిల్లాల నుంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను జగిత్యాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  (K. Haribabu, News 18, Rajannasircilla)

  మద్యం (Alcohol) మానేయమన్నందుకు భార్య గొంతు కోశాడు ఓ కసాయి భర్త (Husband killed wife). ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla) వేములవాడ పట్టణంలో జులై 21న చోటుచేసుకోగా..జులై 26న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. వేములవాడ (Vemulawada) పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం... భవాని నగర్ కు చెందిన అహ్మద్ (43) గత కొద్ది రోజులుగా తాగుడుకు బానిస అయ్యాడు. భర్త మద్యం సేవించడం చూడలేని భార్య పర్వీన్ బేగం.. తాగుడు మానేయాలంటూ ఒత్తిడి తెచ్చింది. దీంతో పర్వీన్ పై కక్ష పెంచుకున్న అహ్మద్.. కత్తితో భార్య గొంతు కోసి ఇంటి నుండి పరారయ్యాడు. కొడుకు సయ్యద్ సోయాబ్ ఫిర్యాదు మేరకు అహ్మద్ పై కేసు నమోదు చేశారు వేములవాడ పోలీసులు. ఈక్రమంలో మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపినట్లు వేములవాడ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.

  గంజాయి తరలిస్తున్న యువకులు..

  ఇతర జిల్లాల నుంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను జగిత్యాల (Jagityal) జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయికల్ ఎస్ఐ కిరణ్ కుమార్, సీసీఎస్ ఇనస్పెక్టర్ కిరణ్ తెలిపిన వివరాలు మేరకు.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి గంజాయి సేకరించి జగిత్యాల జిల్లాలో పలువురు యువకులకు అమ్ముతున్నారన్న సమాచారంతో మంగళవారం సీసీఎస్ అధికారులు, పోలీసులు భూపతిపూర్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు.

  ఈ తనిఖీల్లో సిరిసిల్ల జిల్లా చిర్లవంచ గ్రామానికి చెందిన వేల్పుల శ్రీనివాస్, వల్లంపట్ల గ్రామానికి చెందిన నేరెళ్ల విస్వంత్, భూపతిపూర్‌కు చెందిన నితిన్‌లు గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల నుంచి ప్యాకెట్ల రూపంలో ఉన్న అరకిలో గంజాయిని, హుక్కా పీల్చే పరికరంతో పాటు 3 సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

  First published:

  Tags: Alcohol, Crime news, Husband kill wife, Local News, Siricilla

  ఉత్తమ కథలు