హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bullet Bandi Song: కొంపముంచిన బుల్లెట్ బండి సాంగ్.. ఆమె డ్యాన్స్‌పై జిల్లా కలెక్టర్ సీరియస్..

Bullet Bandi Song: కొంపముంచిన బుల్లెట్ బండి సాంగ్.. ఆమె డ్యాన్స్‌పై జిల్లా కలెక్టర్ సీరియస్..

Bullet bandi dance

Bullet bandi dance

Bullet Bandi song: బుల్లెట్ బండి పాటను తెలంగాణలోని పాలమూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్ రాశారు. ఆ పాటకు సింగర్ మోహన భోగరాజు పాడడతంతో పాటు డాన్స్ చేసి ప్రైవేట్ ఆల్బమ్ విడుదల చేశారు.

  ''నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. డుగు డుగు డుగు డుగు డుగు డుగని..'' ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఎక్కడ చూసినా.. ఇదే పాట వినిపిస్తోంది. అంతలా జనం గుండెల్లో నిలిచిపోయింది. తెలంగాణ జానపదం.. అందులో ఉన్న భావం.. అందరికీ బాగా కనెక్ట్ అయింది. అందుకే అంతలా దుమ్మురేపుతోందీ బుల్లెట్ బండి పాట. ఇటీవల ఓ పెళ్లి కూతురు తమ పెళ్లి బరాత్‌లో బుల్లెట్ పాటకు అద్దిరిపోయే స్టెప్పులేసింది. పాట రూపంలో..  తన భర్తపై  వెలకట్టలేనంత  ప్రేమను కుమ్మరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుల్లెట్ పాట మరింతగా పాపులర్ అయింది.  తాజాగా ఓ నర్సు కూడా ఇదే పాటకు స్టెప్పులేసింది. ఏకంగా ఆస్పత్రి లోపలే డాన్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పీహెచ్‌సీలో పనిచేస్తున్న నర్సు బుల్లెట్ పాటకు డాన్స్ చేసి ఆకట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వేడుకలు ముగిసిన తర్వాత.. ఆస్పత్రిలోని నర్సులంతా కలిసి సందడి చేశారు.   వారిలో ఒక నర్సు డాన్స్ చేస్తుండగా.. మిగతా వారు చప్పట్ల కొట్టి ఎంకరైజ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. పెళ్లి కూతురు వీడియోలా ఇది కూడా వైరల్‌ అయింది. ఐతే ఈ ఘటనపై  ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్...  విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో  జిల్లా వైద్యాధికారి సుమన్ రావు ఆమెకు మెమో జారీ చేశారు. విచారణ అనంతరం ఆ నర్సుపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

  Telangana: కల్లు గీత కార్మికులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో కొత్త పథకం..!

  ఐతే ఇందులో నర్సు తప్పేం లేదని కొందరు సమర్థిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగానే డ్యాన్స్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. విరామ సమయంలోనే చేసింది తప్ప.. విధులను పక్కనబెట్టి చేయలేదని అంటున్నారు.  మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆస్పత్రిలో రోగులను పట్టించుకోకుండా.. యూనిఫామ్‌లో డాన్సులు చేయడమేంటని మండిపడుతున్నారు. ఇలాంటివి ఇంట్లో చేసుకోవాలి.. ఆస్పత్రుల్లో కాదని విమర్శిస్తున్నారు. మొత్తంగా ఆ పెళ్లి కూతురులాగే.. ఈ నర్సు పాట కూడా సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.

  Harish Rao: ఈటల రాజీనామా చేసిన ఆ స్థానంలో హరీష్ రావు..

  కాగా, బుల్లెట్ బండి పాటను తెలంగాణలోని పాలమూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్ రాశారు. ఆ పాటకు సింగర్ మోహన భోగరాజు పాడడతంతో పాటు డాన్స్ చేసి ప్రైవేట్ ఆల్బమ్ విడుదల చేశారు. అయితే ఆమె ఒరిజినల్‌గా పాడిన పాటకు బాగానే  ప్రాచుర్యం లభించినప్పటికీ... కొద్ది రోజుల తర్వాత పెళ్లి కూతురు సాయిశ్రీ తన పెళ్లిలో భర్త ముందు చేయడంతో మరింతగా వైరల్ అయింది.  పాట నేపథ్యానికి అనుగుణంగా డాన్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ తర్వాత  ఒరిజినల్ సాంగ్‌ను చూసే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. అందుకే య్యూటూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి.

  ఇవి కూడా చదవండి:

  TS NEWS :బుల్లెట్ బండి ఎక్కిన నర్స్... మొన్న పెళ్లి కూతురు... నేడు స్టాఫ్ నర్సు

  Rain Alert: ఉపరితల ఆవర్తనం ప్రభావం.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు..

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Sircilla, Telangana, Trending, Viral Video

  ఉత్తమ కథలు