Home /News /telangana /

RAJANNA SIRCILLA CCTV CAMERAS THAT WENT UNATTENDED DUE TO NEGLECT IN VEMULAWADA SNR RKH BRV

అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు .. వేములవాడలో నిర్వాహణకు నోచుకోని నిఘా వ్యవస్థ 

(నిఘాపై

(నిఘాపై నిర్వాహణ ఏది)

Vemulawada : నిర్వాహణ లోపంతో సీసీ కెమెరా నిఘా వ్యవస్థ పనికిరాకుండా పోయింది. వేములవాడ అర్బన్ పరిధిలోని గ్రామాల్లో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. గతంలో కురిసిన అకాల వర్షాల సమయంలో పిడుగుపాటుకు గురై పలు గ్రామాల్లో సీసీ కెమెరాలు ధ్వంసం అయ్యాయి.

ఇంకా చదవండి ...
    (K.Haribabu,News18,Rajanna siricilla)
    ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల పర్యవేక్షణ నిమిత్తం.. అధునాతన పరికరాలు, నిఘా వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ, ప్రజల రక్షణలో భాగంగా ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు(CCTV cameras)ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. చోరీ ఘటనలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగినప్పుడు ఆయా కేసుల విచారణలో భాగంగా సీసీ కెమెరాల దృశ్యాలు(CCTV footage)సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈక్రమంలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరిస్తూ రాజన్నసిరిసిల్ల (Rajanna sircilla)జిల్లా వేములవాడ (Vemulawada)అర్బన్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఇటీవల గ్రామ పంచాయితీ సభ్యులు, స్థానిక పోలీసులు, అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల పరిధిలో సీసీకెమెరాలు ఆర్చుకోవడం ద్వారా అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయవచ్చంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ కెమెరాలు ధ్వంసం అయ్యాయి.

    గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాల ఏర్పాటు:
    వేములవాడ అర్బన్ పరిధిలోని అనుపురం, రుద్రవరంతో పాటు పలు గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై స్థానిక పోలీసులు గతంలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. సీసీ కెమెరాలతో దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి దొంగతనాల నివారణకు కృషి చేయవచ్చని, ఇతర అక్రమాలకూ అడ్డుకట్ట వేయవచ్చని వేములవాడ పట్టణ పోలీసులు ఈ అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పట్టణ సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి పట్టణ ప్రజలతో పాటు అర్బన్ మండల ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో వేములవాడ అర్బన్ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్థులు. మొదట్లో పరిస్థితి బాగానే ఉన్నా, నిర్వహణ లోపంతో సీసీ కెమెరా నిఘా వ్యవస్థ పనికిరాకుండా పోయింది. గ్రామాల్లో సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. గతంలో కురిసిన అకాల వర్షాల సమయంలో పిడుగుపాటుకు గురై పలు గ్రామాల్లో సీసీ కెమెరాలు ధ్వంసం అయ్యాయి.

    ఇది చదవండి : నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు .. లేడీ కార్పొరేటర్‌ని ఎమ్మెల్యే అలా అనొచ్చా



    నిఘా లోపించడంతో రెచ్చిపోతున్న దొంగలు:
    వేములవాడ నియోజకవర్గం పరిధిలోనిఅనుపురం, రుద్రవరంతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ఇదే అదునుగా భావించిన దొంగలు ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో విలువైన వస్తువులను చోరీ చేస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఈ గ్రామాల పరిధిలో తరచూ చోరీ ఘటనలు చోటుచేసుకోవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పాలకవర్గం సభ్యులు, వెంటనే అధికారులు స్పందించి ధ్వంసమైన సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

    ఇది చదవండి: ఆకతాయి చేష్టలు, అసాంఘీక కార్యకలాపాలకు చెక్ .. దూకుడు పెంచిన అక్కడి పోలీసులు


    ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా:
    ఈ విషయంపై రుద్రవరం గ్రామ సర్పంచ్ రామ్ రెడ్డి మాట్లాడుతూ \"గతంలో రూ. 20 వేలు ఖర్చు చేసి సీసీ కెమెరాలకు మరమ్మత్తులు జరిపించామని, మరో రూ. 30,000 అవసరం ఉండగా గ్రామ పంచాయతీ నిధుల నుంచి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని\"వాపోతున్నారు.నిర్వహణలేక అధునాతన నిఘా వ్యవస్థ ఇలా మరుగున పడిపోవడంపై సర్పంచ్ రామ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Cctv, Local News, Siricilla, Vemulawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు