హోమ్ /వార్తలు /తెలంగాణ /

కారు వాడేది ఒకటి... బిల్లు పొందేది మాత్రం ఇంకో కారుకు..

కారు వాడేది ఒకటి... బిల్లు పొందేది మాత్రం ఇంకో కారుకు..

అవినీతికి పాల్పడుతున్న అధికారి

అవినీతికి పాల్పడుతున్న అధికారి

Telangana: సామాన్యుడి చేతిలో ఆయుధంగా సమాచార హక్కు చట్టం తయారైంది. ఎంతటి వారైనా అవినీతికి పాల్పడిన ఒక్క సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు, అధికారులు చేసే అవినీతి బట్ట బయలు అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(K.Haribabu,News18, Rajanna siricilla)

సామాన్యుడి చేతిలో ఆయుధంగా సమాచార హక్కు చట్టం తయారైంది. ఎంతటి వారైనా అవినీతికి పాల్పడిన ఒక్క సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు, అధికారులు చేసే అవినీతి బట్ట బయలు అవుతోంది. అందులో భాగంగా MPDO ఉపయోగిస్తున్న సొంత కారుకు బిల్లు ఎలా పొందుతున్నాడనే సమాచారం హక్కు చట్టం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన గుండ తిరుపతి గౌడ్ దరఖాస్తు చేసుకున్నాడు.

అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కోనరావుపేట మండల MPDO (ఎంపీడీవో ) విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ వాడుతున్న వినియోగిస్తున్న కారు టాటా ఇండికాకు నెల నెల బిల్లు తీసుకుంటున్నాడు. కానీ తాను వినియోగిస్తున్న కారు మాత్రం మారుతి సూజికి ఎర్టిగా కారు.హుజురాబాద్ కు చెందిన కొత్తూరి ఆశీర్వదా పేరు మీద ఉన్న టాటా ఇండికా క్యాబ్ AP 15 TV 2897 నెంబర్ గల వాడుతున్నట్లు ఉన్నతాధికారులకు చూపించాడు. దీని పేరు మీదనే ప్రతి నెల జాతీయ మహ్మాత గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు తీసుకుంటున్నాడు.

కానీ ఎంపీడీవో మాత్రం తన సొంత వాహనం సరియైనా మారుతి సుజికి ఎర్టిగా TS 02 TV 0320 నెంబర్ గల కారును మాత్రమే ఉపయోగిస్తున్నాడు.గత 2 సంవత్సరాలుగా ఈ విధంగా కారును వినియోగిస్తున్నాడు. కారు వాడేది ఒకటి. బిల్లు పొందేది మాత్రం ఇంకో కారుది..మండలంలో అధికారుల ఎవరూ తప్పు చేయకుండా పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారే, ఈ విధంగా మరో కారు మీద బిల్లు పొందడం ఎంత వరకు కరెక్ట్ అని సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేసుకున్న వ్యక్తి గుండా తిరుపతిగౌడ్ ప్రశ్నిస్తున్నాడు.

అందరికి ఆదర్శంగా ఉండి మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సిన అధికారే, ఇలాంటి తప్పులకు పాల్పడటం సరైన పద్ధతి కాదని,దీని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి,చర్యలు తీసుకోవాలని తిరుపతిగౌడ్ కోరుతున్నాడు.. జిల్లా ఉన్నాతాధికారులు ఎంపీడీవో పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

First published:

Tags: Local News, Rajanna sircilla, Telangana

ఉత్తమ కథలు