హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: కారు.. బస్సు ఢీ.. ప్రమాదం దెబ్బకి ఊడిన బస్సు చక్రాలు

Rajanna Siricilla: కారు.. బస్సు ఢీ.. ప్రమాదం దెబ్బకి ఊడిన బస్సు చక్రాలు

X
ఘోర

ఘోర ప్రమాదం

Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ రూరల్ మండలం నాగయ్య పల్లె, పోశేట్టిపల్లి గ్రామాల మధ్య వద్ద ఆర్టీసీ బస్సు కారు ఢీకొనగా, కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : హరి

లొకేషన్ : రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ రూరల్ మండలం నాగయ్య పల్లె, పోశేట్టిపల్లి గ్రామాల మధ్య వద్ద ఆర్టీసీ బస్సు కారు ఢీకొనగా, కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. బస్సు చక్రాలు ఊడిపడ్డాయి. అదే సమయంలో పోలీస్ వాహనంలో చందుర్తి నుండి వేములవాడకు వస్తున్న చందుర్తి CI కిరణ్ కుమార్ ప్రమాదంలో గాయపడ్డ వారిని హుటాహుటిన పోలీస్ వాహనంలో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.

కారులో ప్రయాణిస్తున్న వారు కరీంనగర్ జిల్లా సదాశివపురంకు చెందిన వారిగా గుర్తించారు. వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ నుంచి భీమ్గల్ వెళ్తున్న ఆర్మూర్ ఆర్టీసీ బస్సు.. వేములవాడకు వస్తున్న బెలినో కారు డిజిల్ ట్యాంక్ సమీపంలో అతివేగంతో ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపాడు. బస్సు వెనుక వైపున రెండు చక్రాలు ఊడిపోవడంతో.. ఆర్టీసీ బస్సు రహదారికి అడ్డుగా ఏర్పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న వేములవాడ రూరల్ పోలీసులు, వేములవాడ డిపో మేనేజర్ భీమ్ రెడ్డిలు చేరుకొని జేసీబీ సాయంతో రోడ్డుపై నుంచి ఆర్టీసీ బస్సును తొలగించారు.

ఈ రోడ్డు ప్రమాదంలో కారు, బస్సులో వారు స్వల్ప గాయాలతో బయటపడడంతో స్థానికులతో, ఆర్టీసీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో బస్సు చక్రాలు ఊడిపోవడంతో ఇది ఆర్టీసీ బస్సు ఫిట్నెస్ అంటూ సోషల్ మీడియాలో సైతం నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ సంబంధిత అధికారులు స్పందించి నూతన బస్సులను ప్రవేశపెట్టి ప్రమాదాలను అరికట్టాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టిసి బస్సు వెనకాల ఎలాంటి వాహనం లేకపోవడంతోనే పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. భారీ రోడ్డు ప్రమాదంతో భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అతివేగంగా ఆర్టీసీ బస్సు టైర్లను కారు ఢీకొనడంతోనే బస్సు రెండు టైర్లు ఊడిపోయాయని డ్రైవర్ తెలిపాడు. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం చూసినవారు భయాందోళనకు గురవుతున్నారని చెప్పాలి. కానీ స్వల్ప గాయాలతో కారులో ఉన్నవారు బయటపడడం, కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతోనే వారికి ప్రాణాపాయం తప్పినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు నియంత్రిత వేగంతో ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు