హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: ప్రజలతో వ్యాపారం చేసే పెట్టుబడి దారీ దేశాలు.. మానవాళి కోసం పనిచేసే సోషలిస్ట్ దేశాలు

Rajanna Siricilla: ప్రజలతో వ్యాపారం చేసే పెట్టుబడి దారీ దేశాలు.. మానవాళి కోసం పనిచేసే సోషలిస్ట్ దేశాలు

సోషలిస్ట్ దేశాలు

సోషలిస్ట్ దేశాలు

Telangana: సోషలిస్టు దేశం ' క్యూబా ' నిస్వార్థంగా అల్జీమర్స్ వ్యాధితో పాటు లంగ్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, ప్రాస్టెడ్ క్యాన్సర్ వంటి మహమ్మారి నుంచి ప్రపంచ మానవాళికి విముక్తి కలిగించేందుకు వ్యాక్సిన్ ను అందించబోతోందని, వ్యాక్సిన్ తయారీ చివరి దశలో ఉందని ప్రపంచ విప్లవయోధులు చేగువేరా కుమార్తె ప్రముఖ పిల్లల డాక్టర్ అలైదా చేగువేరా తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : హరి

లొకేషన్ : సిరిసిల్ల

సోషలిస్టు దేశం ' క్యూబా ' నిస్వార్థంగా అల్జీమర్స్ వ్యాధితో పాటు లంగ్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, ప్రాస్టెడ్ క్యాన్సర్ వంటి మహమ్మారి నుంచి ప్రపంచ మానవాళికి విముక్తి కలిగించేందుకు వ్యాక్సిన్ ను అందించబోతోందని, వ్యాక్సిన్ తయారీ చివరి దశలో ఉందని ప్రపంచ విప్లవయోధులు చేగువేరా కుమార్తె ప్రముఖ పిల్లల డాక్టర్ అలైదా చేగువేరా తెలిపారు.

క్యూబా దేశం నుంచి హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా డాక్టర్ అలైదా గువేరా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపీబోయినపల్లి వినోద్ కుమార్ తో క్యాన్సర్ మహమ్మారి, ప్రమాదకర వ్యాధుల గురించి మాట్లాడారు. సోషలిస్టు దేశాలు ప్రజల కోసం నిలబడతాయని, అందులో భాగంగానే క్యూబా ప్రపంచ మానవాళికి అండగా నిలిచేందుకు క్యాన్సర్ వ్యాక్సిన్ ను అందించబోతోందని బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.

పెట్టుబడిదారీ దేశాలు ప్రజల అవసరాలతో వ్యాపారం చేస్తాయని, కానీ సోషలిస్టు దేశం క్యూబా మాత్రం ప్రజల కోసం నిలబడుతోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధితో పాటు ప్రమాదకర వ్యాధులను సమూలంగా తుడిచి పెట్టేందుకు క్యూబా దేశం కంకణం కట్టుకుందని, ఇది గొప్ప విషయం అని వినోద్ కుమార్ అన్నారు. క్యూబా దేశ జాతీయ నాయకులు ఫిడేల్ కాస్ట్రో చొరవ వల్ల విద్యా పరంగా క్యూబా దేశం ఎంతో పురోగతి సాధించిందని, క్యూబా దేశంలోని డాక్టర్లు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 56 దేశాలలో వైద్య సేవలు అందిస్తున్నారని అలైధా తెలిపారు.

అమెరికా దేశం ఆర్థిక పరంగా ఎన్నో రకాల ఆంక్షలు విధించినా మొక్కవోని ధైర్యంతో క్యూబా దేశం ముందుకు సాగుతోందని అలైదా ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విద్యా, వైద్య రంగాల్లో క్యూబా దేశం గణనీయమైన ప్రగతిని సాధించింది అని అలైథా పేర్కొన్నారు. వైద్య రంగంలో క్యూబా ఇప్పటికే ప్రపంచ మానవాళికి సేవలు అందిస్తోందనిఅలైదా తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్, ప్రమాదకర వ్యాధుల నుంచి ప్రపంచ మానవాళిని ఆదుకోవడం క్యూబా లక్ష్యం అని అలైదా చే గువేరా తెలిపారు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు