Home /News /telangana /

RAJANNA SIRCILLA CAB DRIVER HELD FOR CHEATING INNOCENT WOMEN FOR CASH ABH BRV RKH

Rajanna Sircilla: యువతులతో పరిచయాలు, అందినకాడికి దోచుకున్న యువకుడు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?

 యువతులతో పరిచయాలు, అందినకాడికి దోచుకున్న యువకుడు

యువతులతో పరిచయాలు, అందినకాడికి దోచుకున్న యువకుడు

యువతులతో పరిచయాలు పెంచుకుని ఆనక వారి నుంచి అందినకాడికి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాడిని సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల డీఎస్సీ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు మేరకు

    (K.Haribabu, News 18 , Rajanna sircilla)

    యువతులతో పరిచయాలు పెంచుకుని ఆనక వారి నుంచి అందినకాడికి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాడిని సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు. అమాయక యువతులను వలలో వేసుకుని వారి నుంచి రూ. లక్షల్లో దండుకున్నాడు ఆ మాయగాడు. సిరిసిల్ల డీఎస్సీ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వరుకుటి మల్లేశం (34) పలువురి వద్ద నుంచి రూ.7.67,500 వరకు వసూలు చేసినట్లుగా వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మల్లేశం నుంచి రూ.2.95 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లికి చెందిన వరుకుటి మల్లేశం ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. స్వగ్రామంలో ఉన్న సమయంలోనే బెల్లం విక్రయదారులను బెదిరించిన ఘటనలో మల్లేశంపై కేసు నమోదు కాగా.. జైలుకు పంపే సమయంలో హైదరాబాద్ పారిపోయాడు. అక్కడ జల్సాలకు అలవాటుపడ్డ మల్లేశం సులువుగా డబ్బు సంపాదించేందుకు యువతులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈక్రమంలో విశాఖపట్నంకు చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్న మల్లేశం అనారోగ్యం బారిన పడ్డానని రూ. 95,000 తీసుకున్నాడు. అనంతరం మల్లేశం నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో బాధితురాలు పోలీసు కేసు పెట్టింది. ఇక జగిత్యాలలోని తన స్నేహితుడి నుంచి కూడా కొంత డబ్బు తీసుకొని మోసం చేసిన విషయంలో జైలుకు కూడా వెళ్లివచ్చాడు మల్లేశం. కొత్తపల్లికి చెందిన పెరిమిల్లి దేవయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడని తెలుసుకొని సీఎంఅర్ఎఫ్ ఫండ్ ఇప్పిస్తానని బాధితులను నమ్మించి రూ.47000 తీసుకున్నాడు. 2019లో ముస్తాబాద్ మండలం ఆవునూరుకు చెందిన ఒక బాలుడి కిడ్నీలు పాడవగా అతని చికిత్సకు ప్రభుత్వం నుంచి రూ.50.72 లక్షలు మంజూరైనట్లు బాలుడి తల్లిని నమ్మించి ఆడబ్బు రావాలంటే ముందుగా కొంత డబ్బు చెల్లించాలని వారి వద్ద నుంచి రూ.6,25,500 దండుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో ముస్తాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మండల కేంద్రంలో మల్లేశంను అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.2.95లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

    మానవ అక్రమ రవాణాలో బాలికలు, మహిళలు, పిల్లలే ఎక్కువగా వున్నారని డీఎస్పీ నాగేంద్ర అన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చైల్డ్ హెల్ప్ లైన్ -1098 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్ర చారి మాట్లాడుతూ...మానవ అక్రమ రవాణా వివిధ రూపాల్లో జరుగుతుందని తెలిపారు. మానవ అక్రమ రవాణాలో బాలికలు, మహిళలు, చిన్నారులు ఎక్కువగా వున్నారని, తరుచుగా మిస్సింగ్ అయ్యారనే మాటలు వింటూనే వుంటామని అన్నారు. ఎవరైనా డబ్బులు ఆశ చూపి బలవంతంగా, మోసపూరితంగా, వారి ప్రయోజనాల కోసం, వెట్టి చాకిరి చేయించడానికి, వ్యభిచారం చేయించడానికి, అవయవ మార్పిడి చేసేందుకు ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయని నాగేంద్ర చారి తెలిపారు. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా వుండాలని ప్రతి ఒక్కరికీ అక్రమ రవాణాపై అవగాహన వుండాలని తెలిపారు. మానవ అక్రమ రవాణాపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే హెల్ప్ లైన్-1098 లేదా 100కి ఫోన్ చేయాలని అన్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు