హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: బుద్ధుని విగ్రహం ధ్వంసం.. దుండగులను శిక్షించాలని డిమాండ్

Telangana: బుద్ధుని విగ్రహం ధ్వంసం.. దుండగులను శిక్షించాలని డిమాండ్

X
బుద్ధుని

బుద్ధుని విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు

Siricilla: మానవుని సుఖదుఃఖాలకు కారణం అనంతమైన కోరికలేనని బుద్ధుడు తెలిపాడు. శాంతి మూర్తి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

K.Haribabu,News18, Rajanna siricilla

మానవుని సుఖదుఃఖాలకు కారణం అనంతమైన కోరికలేనని బుద్ధుడు తెలిపాడు. శాంతి మూర్తి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల ముందు ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుని విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బుద్ధుని విగ్రహానికి గురువారం నాయకులు మోతే బాబు, గుట్టే ప్రభాకర్, పులి సత్యం, దారం చంద్రంతదితరులు పాలాభిషేకం చేశారు. గత ఆరు నెలలక్రితం ఏర్పాటుచేసిన బుద్ధుని విగ్రహాన్ని ప్రారంభించక ముందే మందుబాబులు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని అన్నారు. బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

బుద్ధుడు ఏ కులానికి మతానికి చెందిన వాడు కాదని, ప్రపంచంలో అన్నింటికీ కారణం కోరికలు ఒకటేనని చాటిచెప్పాడు. అన్నిటికీ కారణం కోరికలేనని దేశానికీ శాంతి సందేశాన్ని అందజేశారు. విగ్రహా ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు త్వరగా పట్టుకోవాలని కోరారు. గ్రామానికి చెందిన యువతీ యువకులు సైతం దుండగులను పట్టుకునేందుకు సహకరించాలని కోరారు.ఇంతకు ముందు లేనివిధంగా చందుర్తి మండల కేంద్రంలో కొందరు వ్యక్తులు, మూర్ఖులు దుచర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఒక్క రాజకీయ నాయకుడు సైతం బుద్ధునిపై దాడిని ఖండించకపోవడం సొచనీయం,సిగ్గుచేటు అన్నారు.

శ్రీశంకరాచార్యులవారు చెప్పిన గోవింద ద్వాదశమంజరికా స్తోత్రములోని మొదటి చరణం పరమపవిత్రమైనది. అట్లే గోవింద నామము సర్వ పాపహరణం...దానికి సమరూపం \"బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి,సంఘం శరణం గచ్ఛామి అనునది తేజిత బౌద్ధధర్మ సూత్రాలు పరమధర్మమను బౌద్ధతత్వాన్ని తన కఠోర నియమావళితో ఆవిష్కరించి గౌతమ బుద్ధుడు బోధిసత్వుడైనాడు... నిష్కామి కానివాడు ముక్తసంగుడు కాజాలడని,ఎలుగెత్తి చాటి మానవజాతికి మార్గదర్శకతను అందించిన మహాప్రవక్త బుద్ధుడు. దశావతారాల్లో ఒక అవతారపురుషునిగా బుద్ధుడు భావించబడ్డాడు నేడు..తన తొలి ఉపదేశం కోసం వారణాసి దగ్గరగా ఉన్న సారనాథ్ ను ఎన్నుకున్నాడు బుద్ధుడు..

సిద్ధార్ధుడు బోధ పూర్వక జ్ఞానోదయం పొందిన కారణంగా బుద్ధ భగవానునిగా పిలవబడడం మారడు.

బుద్ధ భగవానుడు 44 వయసు వచ్చేవరకు ఉపదేశాలు ఇస్తూ దేశాటనం చేసాడనే విషయం మనందరికీ తెలిసిందే. బుద్ధ భగవానుడు సమాజహితం కోసం చేసిన పనులుఎన్నో సంవత్సరాలుగా సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు, మూర్ఖ ఆచారాలు, భేదభావాలు అన్నింటిని పెకిలించివేశాడు బుద్ధ భగవానుడు. బుద్ధ భగవానుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన అగాంతకులను.. త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు గ్రామ ప్రజలు. గ్రామ ప్రజలందరూ దాతల సహాయంతో తలవంత డబ్బు వేసుకొని బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెబుతున్నారు ప్రజలు.ఈ కార్యక్రమంలో నాయకులు పిట్టల బాబు, తిరుపతి , వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

First published:

Tags: Local News, Siricilla, Telangana

ఉత్తమ కథలు