హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Sircilla: సిరిసిల్ల చీరకు బ్రాండ్ ఇమేజ్.. బ్రాండ్ నేమ్ ఏంటో తెలుసా..?

Rajanna Sircilla: సిరిసిల్ల చీరకు బ్రాండ్ ఇమేజ్.. బ్రాండ్ నేమ్ ఏంటో తెలుసా..?

సిరిసిల్ల

సిరిసిల్ల పట్టుచీరలకు సరికొత్త బ్రాండ్ ఇమేజ్

Pattu Sarees: కంచి, ధర్మవరం, గద్వాల్, బెనారస్.. మన దేశంలోని ఈ పట్టణాల ర్లు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది పట్టు చీర. పట్టు చీరలకు పెట్టింది పేరైన ఈ ప్రాంతాలలో చేనేత కళాకారులు నాణ్యమైన పట్టు చీరలు తయారు చేస్తుంటారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  Haribabu, News18, Rajanna Sircilla

  కంచి, ధర్మవరం, గద్వాల్, బెనారస్.. మన దేశంలోని ఈ పట్టణాల ర్లు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది పట్టు చీర. పట్టు చీరలకు పెట్టింది పేరైన ఈ ప్రాంతాలలో చేనేత కళాకారులు నాణ్యమైన పట్టు చీరలు తయారు చేస్తుంటారు. దాంతో ఈ ప్రాంతాల పేరు మీదుగానే ఆ చీరలకు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చేనేత కళాకారులు ఉన్నారు. వీరి చేతుల మీదుగా అనేక కళారూపాల్లో చీరలు ప్రాణం పోసుకున్నాయి. చేనేతకు పెట్టింది పేరైన రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) సిరిసిల్లలో వందల సంఖ్యలో చేనేత కళాకారులూ చీరలు నేస్తుంటారు. అయితే ఇన్నేళ్ళుగా సిరిసిల్ల చీరలకు కళారూపం ఇస్తోన్నా.. ఒక బ్రాండ్ ఇమేజ్ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదని చెప్పవచ్చు.

  తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆడపడుచుల కోసం అందిస్తున్న బతుకమ్మ చీరల తయారి సిరిసిల్లలో జరుగుతున్నట్లు తెలుసుకున్న న్యూజీలాండ్ (New Zealand) కు చెందిన ప్రవాస భారతీయురాలు, బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునితా విజయ్ ఇక్కడికి వచ్చారు. ఆ సమయంలో సిరిసిల్ల నేత కళకారుడు హరిప్రసాద్ నేస్తున్న చీరలను గమనించి అతని నైపుణ్యాన్ని, చీరలో నాణ్యతను గుర్తించారు. దీంతో సిరిసిల్ల నేతన్నలతో పట్టు చీరలు తయారు చేయించి మార్కెటింగ్ కల్పిస్తే ఇక్కడి నేతన్నలకు ఉపాధీ కలుగుతుందని భావించిన సునితా తాను అనుకున్నట్టుగా సిరిసిల్లలో పట్టు చీరలు తయారు చేయించి అమెరికా, యూకే, న్యూజిలాండ్‌తో పాటు ఆరు దేశాల్లో సిరిసిల్ల పట్టు చీరలకు అర్డర్లు ఇప్పించారు. అయితే అప్పటికే మార్కెట్లో ధర్మవరం, కంచిపట్టు వంటి చీరలకు బ్రాండ్ ఇమేజ్ ఉండడంతో సిరిసిల్ల పట్టుచీరకూ ఏదైనా బ్రాండ్ ఇమేజ్ కల్పించాలని భావించిన సునితా సీల్క్ మార్క్‌తో కూడిన సిరిసిల్ల పట్టుచీరకు ‘రాజన్న సిరిపట్టు’గా నామకరణం చేశారు.

  ఇది చదవండి: రైతులను నిండా ముంచిన గోదావరి.. ప్రభుత్వసాయం కోసం ఎదురుచూపులు

  ఈక్రమంలో రాజన్న సిరిపట్టు చీరలను శనివారం న్యూజిలాండ్‌లో అక్కడి ప్రవాస భారతీయులతో కలిసి సునితా విజయ్ విడుదల చేశారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్, గౌరవ రాయాబారి భావుదిల్లాన్... సిరిసిల్ల పట్టు చీరను విడుదల చేయగా సూమారు 300 మంది ఎన్ఆర్ఐలు సిరిసిల్ల చేనేత ఉత్పత్తులను ధరించి, 35 మందితో ఫ్యాషన్ షో నిర్వహించారు.

  ఇది చదవండి: జలపాతాల వద్ద ప్రాణాలు విడుస్తున్నారు.. సరదా మాటున విషాదం

  సిరిసిల్ల పట్టు చీరలు బాగున్నాయి: న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్,

  రాజన్న సిరిపట్టు చీరను న్యూజిలాండ్‌లో విడుదల చేసిన సందర్భంగా..అక్కడి మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. సిరిసిల్ల నేతన్నకు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు ప్రయత్నించిన బ్రాండ్ తెలంగాణా పౌండర్ సునితా విజయ్‌ను అభినందించారు. నాలుగేళ్ల క్రితం న్యూజిలాండ్‌లో ఉన్న తెలంగాణ వాసులు బతుకమ్మ పండుగకు ఆహ్వానించగా సిరిసిల్ల చీరనే కట్టుకొని వచ్చానని, అందరితో కలిసి బతుకమ్మ ఆడానని తెలిపారు. అనంతరం తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం తనను హైదరాబాద్‌లో కలిసి..ఎంతో గౌరవించారని న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ గుర్తుచేసుకున్నారు. సిరిసిల్ల చేనేత ఉత్పత్తులకు తాము ప్రచారం కల్పిస్తామని హమీ ఇచ్చారు.

  ఇది చదవండి: తెలంగాణలో దొంగల రాజ్యంగా చరిత్రలో నిలిచిన లింగాల.. ఆ ఊరి కథేంటి..?

  సిరిసిల్ల ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడానికే: సునితా విజయ్. బ్రాండ్ తెలంగాణా, ఫౌండర్

  సిరిసిల్ల నేతల కళానైపుణ్యాన్ని ప్రపంచానికి చెప్పేందుకే పట్టు చీరలు సిరిసిల్లలో తయారు చేయిస్తూ దేశ, విదేశాల్లో తమ బ్రాండ్ తెలంగాణ ద్వారా ప్రమోట్ చేస్తున్నట్లు సునితా విజయ్ పేర్కొన్నారు. సిరిసిల్లలో చీరలు నేయడంలో ఎంతో ప్రతిభ కలిగిన హరిప్రసాద్ ద్వారా పట్టుచీరలు తయారు చేయించి ఆరు దేశాల్లో ప్రస్తుతం మార్కెంటింగ్ కల్పించి అర్డర్లు ఇప్పిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. వచ్చిన ఆర్డర్లలో తమకు ఎటువంటి లాభం లేకుండానే నేరుగా నేతన్నలకే లాభం వచ్చేలా.. అర్డర్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు సునితా తెలిపారు. ప్రస్తుతం సిరిసిల్లలో 40 మంది చేనేత కళాకారులు ఈ రాజన్న సిరిపట్టు చీరల తయారీ ద్వారా ఉపాధీ పొందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తమ బ్రాండ్ తెలంగాణ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Siricilla, Telangana

  ఉత్తమ కథలు