Home /News /telangana /

RAJANNA SIRCILLA BJP SENIOR LEADER ERRAM NARSAIAH DIED AFTER HEALTH ISSUES IN VEMULAWADA ABH BRV RKH

Rajanna Sircilla: అనారోగ్యంతో చికిత్స పొందుతూ బీజేపీ సీనియర్ నేత ఎర్రం నర్సయ్య మృతి 

ఎర్రం నర్సయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుదూ గురువారం మరణించాడు

ఎర్రం నర్సయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుదూ గురువారం మరణించాడు

భారతీయ జనతా పార్టీ వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ ఎర్రం నర్సయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుదూ గురువారం మరణించాడు. 24 సంవత్సరాలుగా బీజేపీలో కొనసాగుతున్న పార్టీ బలోపేతానికి కృషిచేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    (K.Haribabu, News 18, Rajanna Sircilla)

    భారతీయ జనతా పార్టీ వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ ఎర్రం నర్సయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుదూ గురువారం మరణించాడు. అనుపురం గ్రామానికిచెందిన నర్సయ్య 30 రోజుల క్రితం అనారోగ్యంతో కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఈక్రమంలో పరిస్థితి విషమించడంతో నర్సయ్య మృతి చెందాడు. 24 సంవత్సరాలుగా బీజేపీలో కొనసాగుతున్న పార్టీ బలోపేతానికి కృషిచేశారు. ఎర్రం నర్సయ్య పెద్ద కుమారుడు నాగరాజు గత సంవత్సరం కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేడు నర్సయ్య మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. కుటుంబానికి పెద్ద దిక్కులైన ఇద్దరు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు వేదనకు గురైయ్యారు. వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు సైతం నర్సయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.



    అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
    రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో పల్లె నర్సింహులు (35) గురువారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడుపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామానికి చెందిన పల్లె నర్సింహులు రైస్ మిల్లులో డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. భార్య మమత, ఇద్దరు పిల్లలతో కొన్ని సంవత్సరాలుగా ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో గురువారం నర్సింహులు ఉరేసుకొని మృతి చెందడంపై అతని తల్లి పల్లె ఎల్లవ్వ అనుమానం వ్యక్తం చేసింది. తన కొడుకు మృతికి కోడలు మమతపై అనుమానం వ్యక్తం చేసిన ఎల్లవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ ఉపేందర్, ఎస్సై లక్ష్మా రెడ్డిలు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి తల్లి ఎల్లవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య:
    కుటుంబం, ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కలత చెందిన ఓ వివాహిత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన సాయబుగారి ధర్మాగౌడ్‌కు కాలుకు ఆపరేషన్ చేశారు. కాలికి సెప్టిక్ అవడంతో ధర్మగౌడ్ మోకాలి వరకు తొలగించారు వైద్యులు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నాడు. కుటుంబ పోషణ నిమిత్తం ధర్మగౌడ్ భార్య రేణుక... స్థానికంగా హోటల్ నడిపిస్తోంది. గతేడాది రేణుక కుమార్తె ఓ ముస్లిం యువకుడిని వివాహం చేసుకుంది. ఇటు భర్త అనారోగ్యం, కూతురు పెళ్లి , కుటుంబపోషణకు ఆర్థిక ఇబ్బందులతో కలత చెందిన రేణుక గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త ధర్మాగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బొజ్జ మహేశ్ తెలిపారు.

    Read This; Nagarkurnool: కూతురు వరుసయ్యే అమ్మాయితో ప్రేమాయణం.. అమ్మాయి అన్న చూసి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..?
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Nagarkurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు