Haribabu, News18, Rajanna Sircilla
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ (TSPSC Paper Leakag Issue) వ్యహారం తెలంగాణ (Telangana) రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ అంశంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 30 లక్షల మంది నిరుద్యోగ యువతతో చెలగాటం ఆడుతున్న బిఅర్ఎస్ (BRS) ప్రభుత్వంలోని మంత్రి కేటీఆర్ (MInister KTR) రాజీనామా చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. TSPSC పేపర్ లీకేజీకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ తెలంగాణ చౌక్ లో బీజేపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లక్షలాది మంది నిరుద్యోగులు గత 8 సంవత్సరాలుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తే ఇప్పుడు నిర్వహించిన పరీక్ష పేపర్ లిక్ కావడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమన్నారు.పేపర్ లీక్ కావడంతో 30 లక్షల మంది నిరుద్యోగ యువకులునిరాశతో ఉన్నారని, వారందరికీ ప్రభుత్వమే భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
పేపర్ రాసిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి మంత్రి కేటీఆర్ పూర్తి భాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దొర నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపించారు. నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ టిల్లు అని అన్నారు. మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ నోట్ అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. లిక్కర్ కేసులో కవిత అడ్డంగా దొరికిపోయిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అధికార బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తుందని, వారికి ఎల్లవేళలా బిజెపి అండగా ఉంటుందని, నిరుద్యోగుల ఆత్మవిశ్వాసం పెంచే విధంగా బిజెపి పని చేస్తుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ ఇష్యూపై ఎంతవరకైనా బిజెపి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్నది ఇందుకేనా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్తవి కాదని, రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలు నిరుద్యోగులంతా బిజెపి వైపు చూస్తున్నారని, కేంద్రంలో ప్రధాని మోడీ అమిత్ షా నాయకత్వంలో దేశ అభివృద్ధి కోసం బిజెపి పని చేస్తుందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తమ బతుకులు బాగవుతాయని నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారని, దానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లే ఇచ్చి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana, Telangana bjp, TSPSC