హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Sircilla: బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం.., మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ

Rajanna Sircilla: బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం.., మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ

బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం

బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం

తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల (Bathukamma Sarees) పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంపిణీ చేయాల్సిన చీరలు ఇప్పటికే కేంద్రాల వద్దకు చేరుకోగా గురువారం నుంచి అన్ని జిల్లాల్లో ఈ చీరలను అర్హులైన మహిళలకు అందించనున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  Haribabu, News18, Rajanna Sircilla

  తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల (Bathukamma Sarees) పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంపిణీ చేయాల్సిన చీరలు ఇప్పటికే కేంద్రాల వద్దకు చేరుకోగా గురువారం నుంచి అన్ని జిల్లాల్లో ఈ చీరలను అర్హులైన మహిళలకు అందించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ హాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్ ఆడపడుచులకు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చే బతుకమ్మ చీరల పంపీణి రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్టంలోని నేతన్నలకు (సిరిసిల్ల) చేయూతనివ్వడంతో పాటు, ఆడబిడ్డలకు ప్రభుత్వం తరుపున కానుకగా ఇవ్వాలన్న లక్ష్యంతో 2017 నుంచి ఈ బతుకమ్మ చీరాల పంపిణీ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చీరల పంపీణి జరగనుంది.

  ఇప్పటికే అన్ని జిల్లాల కలెకర్లతో సమన్వయం చేసుకుని చీరల పంపీణీ కోసం రాష్ట్ర టెక్స్ టైల్ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్షోభంలో చిక్కుకున్న చేనేతలకు భరోసా కల్పించడంతో పాటు వారి సంపాదన రెట్టింపు అయి స్వేచ్ఛగా జీవిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

  ఇది చదవండి: రోడ్డెక్కిన మహిళలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా.. ఎందుకంటే?

  బతుకమ్మ చీరల పంపిణీతో అటు ఆడబిడ్డలకు ఆనందంతో పాటు ఏడాది పొడవునా నేతన్నలకు ఉపాధి భరోసా లభించినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా చేనేత కార్మికులకు పని కల్పిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం టెక్సటైల్ ఉత్పత్తులపైన జీఎస్టీ వేసి నేతన్నలను నిలువునా ముంచే నిర్ణయాలు తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేకుండా చేనేత కార్మికుల కోసం తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని కేటీఆర్ అన్నారు.

  ఈ ఏడాది సూమారు కోటి బతుకమ్మ చీరలను రాష్ట్ర వ్యాప్తంగా పంపీణి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కంటే ఎక్కువ డిజైన్లు, రంగుల వైరైటీల్లో బతుకమ్మ చీరలను తెలంగాణ టెక్స్టైల్ శాఖ తయారు చేసిందన్నారు. చీరల డిజైన్ కోసం నిఫ్ట్ కళాశాల డిజైనర్స్, పలువురు మహిళా ప్రతినిధుల అభిప్రాయాలూ తీసుకుని అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ఏడాది బతుకమ్మ చీరలను తయారు చేసినట్లు మంత్రి వివరించారు. 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) తో తయారు చేయబడిన 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను టెక్స్టైల్ శాఖ తయారు చేసిందన్నారు. 6 మీట్లర్ల(5.50, 1.00) పొడవుగల చీరలు 92.00 లక్షలు తయారు చేయించగా, వాటికీ అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్లు పొడవు గల చీరలు మరో 8 లక్షలు మొత్తంగా కోటి బతుకమ్మ చీరలను తయారు చేయించినట్లు మంత్రి తెలిపారు. ఈ బతుకమ్మ చీరల పంపిణీ నిమిత్తం రూ. 339.73 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Karimangar, Local News, Telangana

  ఉత్తమ కథలు