Home /News /telangana /

RAJANNA SIRCILLA ASTROLOGER MURDERED FOR ALLEGEDLY SEXUALLY HARASSING YOUNG WOMAN IN SIRICILLA DISTRICT SNR KNR

Crime News : జాతకాలు చెప్పుకునే వాడిని అమ్మాయి పేరు అడ్డుపెట్టుకొని చంపారు .. హత్య వెనుక పెద్ద కథే ఉందా

(పక్కా పధకం ప్రకారమే)

(పక్కా పధకం ప్రకారమే)

Crime News: భార్య, పిల్లలు ఉన్న ఒక జ్యోతిష్యుడ్ని కొందరు దుండగులు మాట్లాడాలని ఫోన్‌ చేసి పిలిపించి కొట్టి చంపారు. మృతుడు ఓ యువతిని లైంగికంగా వేధించాడనే ఆమె తరపు బంధువులు ఈ దారుణానికి పాల్పడ్డట్లుగా చెబుతుంటే...కాదు మృతుడు ఆ యువతితో క్లోజ్‌గా ఉండటాన్ని తట్టుకోలేకే ఆమె బంధువులు ప్లాన్ ప్రకారం హత్య చేయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  (P.Srinivas,New18,Karimnagar)
  అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జాతకాలు చూస్తూ, జ్యోతిష్యం( Astrologer) చెబుతూ ..తాయత్తలు కట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించాడనే సాకుతో కొందరు దుండగులు అతనిపై మర్డర్ స్కెచ్Murder sketch వేశారు. మాట్లాడాలి..యువతికి క్షమాపణ చెప్పాలని పిలిపించి ఇష్టానుసారంగా కొట్టారు. దుండగులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. ఈదారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna sircilla)లో కలకలం రేపింది.

  జ్యోతిష్యుడ్ని చంపిన దుండగులు..
  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నాగుల వేణుగౌడ్‌ అనే 40సంవత్సరాల వ్యక్తి హత్యకు గురయ్యాడు. టౌన్‌లో జాతకాలు చెప్పుకుంటూ, తాయత్తలు కడుతూ జీవిస్తున్న వేణుగౌడ్‌ను కొందరు దుండగులు పక్కా పథకం వేసి హతమార్చారు. వేణుగౌడ్‌ స్వస్తలం తిప్పాపూర్. భార్య వైష్ణవితో పాటు ముగ్గురు పిల్లలతో కలిసి వేములవాడలో కాపురం ఉంటున్నాడు. జాతకాలు చెప్పుకొని బ్రతుకుతున్న వేణుగౌడ్‌ దగ్గరకు వచ్చిన ఓ యువతిని వేణుగౌడ్ ప్రేమ పేరుతో లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈనేపధ్యంలోనే శుక్రవారం వేణుగౌడ్‌కి ఎలక్ట్రానిక్ మీడియాకి చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి నువ్వు ఓ యువతిని లైంగికంగా వేధించావని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేస్తానంటోందని ఫోన్ చేశాడు. ఆమెకు క్షమాపణ చెబితే కేసు పెట్టదని వేణుగౌడ్‌ని సిరిసిల్లకు రావాలని చెప్పారు.  వేధింపుల పేరుతో హత్యకు పథకం..
  వేణుగౌడ్‌ తన స్నేహితులను తీసుకొని శుక్రవారం మధ్యాహ్నం సిరిసిల్లకు వెళ్లాడు. అతడ్ని కొట్టడానికి ముందుగానే స్కెచ్ వేసుకున్న కొందరు దుండగులు..వేణుగౌడ్‌ ఎస్పీ క్యాంప్‌ ఆఫీస్‌ ప్రాంతంలోని రైతు బజార్‌ దగ్గరకు చేరుకోగానే ఫోన్ చేసి పిలిపించిన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్‌తో పాటు మరికొందరు కర్రలతో వేణుని కొట్టినట్లుగా మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. దుండగులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన వేణును చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు. వేణుగౌడ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

  ఇది చదవండి: "నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మేమంతా చచ్చిపోతాం.. ”.. వికారాబాద్​లో సెల్ఫీ వీడియో కలకలం..  సుపారీ ఇచ్చి మర్డర్ స్కెచ్..
  సాయంత్రం 5గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని ఇంటి నుంచి వెళ్లిన వేణు రాత్రి 8గంటల సమయం వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో అతని భార్య వైష్ణవి బంధువులకు ఫోన్ చేసింది. వాళ్లు కూడా తమ దగ్గరకు రాలేదని చెప్పారు. ఇంతలోనే వేణుగౌడ్‌పై దాడి జరిగిందని అతని భార్యకు ఫోన్‌ కాల్ రావడంతో కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. షాక్ నుంచి తేరుకున్న వెంటనే బంధువులను తీసుకొని సిరిసిల్ల జిల్లాకు వెళ్లారు. అప్పటికే వేణుగౌడ్‌ చనిపోయి విగతాజీవిగా పడి ఉండడం చూసి భార్య పిల్లలు బంధువులు బోరున విలపించారు.

  ఇది చదవండి: యాదాద్రిలో దారుణం.. మాస్కు ధరించి బాలిక దగ్గరికొచ్చి గొంతకోసి పరారైన యువకులు..  చావు వెనుక ప్రేమ కథ ఉందా..
  సిరిసిల్లలో జరిగిన వేణుగౌడ్‌ హత్య వెనుక ప్రేమ వేధింపులు లేవని ... గత కొద్ది రోజులుగా మృతుడు మరో యువతి సన్నిహితంగా ఉంటున్నారని..ఆవిషయం అమ్మాయి బంధువులకు తెలిసి అతడ్ని అంతమొందిచడానికి కిరాయి మనుషులో దాడి చేయించి హత్య చేయించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ హత్య కేసులో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు సిరిసిల్ల పోలీసులు. ఇప్పటికే వేణుగౌడ్‌పై దాడి చేసిన వ్యక్తుల్లో కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని ..దోషులు ఎంతటి వారైనా తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని సిరిసిల్ల టౌన్ సీఐ అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

  ఇది చదవండి: కార్పొరేట్​ హాస్పిటల్​ను తలదన్నేలా ఆ ప్రభుత్వ ఆసుపత్రి.. ఒక్కసారిగా పెరిగిన సహజ కాన్పులు


  Published by:Siva Nanduri
  First published:

  Tags: Love affair, Murder, Siricilla

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు