హోమ్ /వార్తలు /తెలంగాణ /

మహాశివరాత్రికి సిద్ధమవుతున్న రాజన్న.. ముమ్మరంగా ఏర్పాట్లు

మహాశివరాత్రికి సిద్ధమవుతున్న రాజన్న.. ముమ్మరంగా ఏర్పాట్లు

X
రాజన్న

రాజన్న ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు

దక్షిణ కాశీగా, పేదల పెన్నిధిగా, తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజీల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి (Vemulawada Rajanna Temple) వారి సన్నిధానంలో వచ్చే నెల 17 నుంచి మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vemulawada R | Telangana

Haribabu, News18, Rajanna Sircilla

దక్షిణ కాశీగా, పేదల పెన్నిధిగా, తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజీల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి (Vemulawada Rajanna Temple) వారి సన్నిధానంలో వచ్చే నెల 17 నుంచి మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శివరాత్రి మహోత్సవం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఈవో డి.కృష్ణ ప్రసాద్ న్యూస్18తో తెలిపారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో మహాశివరాత్రి జాతరకు వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కుటుంబ సమేతంగా భక్తులు వస్తుంటారు. వారికి ఉచిత బస్సులు, క్యూలైన్లో వద్ద మంచినీటిని ఏర్పాటు, ధర్మ దర్శనం ఇలాంటి ఇబ్బందులు కలకుండా ప్రత్యేకమైన అదనపు క్యూ లైన్లు, చిన్నపిల్లల కోసం బేబీ ఫీడింగ్ సెంటర్లు, తాత్కాలిక వసతి గదులు, చలవపందిల్లు, టాయిలెట్స్, అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈవో కృష్ణ ప్రసాద్.

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలను సైతం శోభయామనంగా అలంకరించేందుకు రంగులు వేస్తూ.. చలవ పందిల్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నత అధికారుల మార్గ నిర్దేశంలో మహాశివరాత్రి జాతర పర్వదినం విజయవంతం చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లు వెల్లడించారు ఈవో. ఇప్పటికే సెస్ ఉన్నతాధికారులు పట్టణంలో విద్యుత్ మరమ్మత్తు పనులు మహాశివరాత్రి నేపథ్యంలో చేపట్టారు. ఆలయ పరిసర ప్రాంతాలను శానిటేషన్ సిబ్బందితో శుభ్రం చేస్తున్నారు. గతంలో భక్తులకు జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు స్వామివారి దర్శనంలో ఎలాంటి లోటుపాట్లు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇది చదవండి: దిక్కులేని దినస్థితిలో నిరుపేద కుటుంబం.. సాయం కోసం ఎదురుచూపులు!

భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు ప్రధాన కూడల వద్ద రూట్ మ్యాప్, ఉచిత బస్సులు, టాయిలెట్స్, చలువ పందిల్లు, మంచినీరు, బేబీ ఫీడింగ్ సెంటర్స్, విద్యుత్ సమస్యలు లేకుండా మరమ్మతులు, పార్కింగ్ ప్లేస్, రోడ్లకు మరమ్మత్తులు, పలు ప్రదేశాల్లో ప్రధమ చికిత్స కేంద్రాల సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు ఆలయ ప్రధాన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు సైతం ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసు వారు సైతం పేర్కొన్నారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా రంగురంగుల విద్యుత్ దీపాలతో,రంగు రంగుల పుష్పాలతో అలంకరిస్తున్నట్లు వెల్లడించారు.

First published:

Tags: Local News, Telangana, Vemulawada

ఉత్తమ కథలు