హోమ్ /వార్తలు /తెలంగాణ /

Jobs in Telangana: గిరిజన గురుకులాల్లో ఉద్యోగావకాశాలు: పోస్టులు, అర్హతల వివరాలివే..

Jobs in Telangana: గిరిజన గురుకులాల్లో ఉద్యోగావకాశాలు: పోస్టులు, అర్హతల వివరాలివే..

ఉద్యోగాలు

ఉద్యోగాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో బోధనేతర సిబ్బంది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్​ విడుదల చేశారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Haribabu, News18, Rajanna Siricilla)రాజన్న సిరిసిల్ల (Rajanna siricilla) జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో (Tribal welfare gurukuls) బోధనేతర సిబ్బంది ఉద్యోగాల 9Jobs)  కోసం అర్హులైన గిరిజన మహిళల (Woman) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారి డీఎస్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్లలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో స్టాఫ్ నర్సు -1, వాచ్ ఉమెన్ -1, మానాలలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఏఎన్ఎం-1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల గిరిజన అభ్యర్థినులు (Tribal Candidates) సర్టిఫికెట్స్‌తో సహా సెప్టెంబర్ 8 లోపు తంగళ్లపల్లి మండలం సారంపల్లి గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో దరఖాస్తు (Apply) చేసుకోవాలని సూచించారు.
  గెస్టు ఫ్యాకల్టీ (Guest faculty) కోసం ఎల్లారెడ్డిపేటలోని ఏకలవ్య గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో టీజీటీ (హిందీ) -3, టీజీటీ (మ్యాథ్స్) -1, పీజీటీ (ఎకనామిక్స్) -2, పీజీటీ (కామర్స్) - 1, మ్యూజిక్ టీచర్ -1, స్టూడెంట్ కౌన్సిలర్ -2, హాస్టల్ వార్డెన్ -2, పీఈటీ -1 పోస్టుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు పీజీలో 50 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి, బీఈడీ, సీటెట్, టెట్ ఉత్తీర్ణులై ఉండాలని అన్నారు. సెప్టెంబర్ 7 లోపు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఏకలవ్య సంక్షేమ గురుకుల పాఠశాలలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


  కరీంనగర్ (Karimnagar) జిల్లా న్యాయసేవాధికార సంస్థలో 5 లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉద్యోగాల భర్తీకి సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి బి.ప్రతిమ నోటిఫికేషన్ విడుదల చేశారు. క్రిమినల్ కేసుల్లో న్యాయ సహాయం ఆశించి వచ్చే వారికి పూర్తిస్థాయి డిఫెన్స్ న్యాయవాదులను ఏర్పాటు చేసి సహాయం అందించేందుకు ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
  SBI SO Recruitment 2022: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త.. 665 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి
  చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్ట్ ఒకటి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టులు 2, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పోస్టులు 2 పోస్టులకు అర్హులైన న్యాయవాదులు దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌కు రూ. 75 వేలు, డిప్యూటీకి రూ.50 వేలు, అసిస్టెంటు రూ.30 వేలు వేతనంగా పొందుపరిచారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తివివరాలు https://districts.ecourts.gov.in/karimnagar వెబ్‌సైట్లో ఉంచారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 5 వరకు గడువు ఉందని అన్నారు. దరఖాస్తులను సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కరీంనగర్ పేరిట పంపించాలని సూచించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: JOBS, Local News, Siricilla, Telangana government jobs

  ఉత్తమ కథలు