Home /News /telangana /

RAJANNA SIRCILLA ANOTHER YOUNG MAN IS THE ANCHOR BITTER SATTI DOPE IN THE SIRICILLA DISTRICT SNR RKH NJ

Telangana:వేములవాడలో బిత్తిరి సత్తి డూప్..సేమ్ టు సేమ్ యాక్టింగ్ చేస్తున్న సాయికుమార్

(జూనియర్

(జూనియర్ బిత్తిరి సత్తి)

Vemulawada:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం వేములవాడలో జూనియర్ బిత్తిరి సత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వేములవాడకు చెందిన హౌ టు సాయి కుమార్ అనే యువకుడు అచ్చం బిత్తిరి సత్తి మిమిక్రీ చేస్తూ అదరగొడుతున్నాడు. అతని వేషధారణ, యాస, నడక, అనుకరణ శైలి… ఇలా అన్నీటా బిత్తిరి సత్తిని దించేస్తున్నాడు. ఇతన్ని అందరూ జూనియర్ బిత్తిరి సత్తిగా పిలుస్తుంటారు.

ఇంకా చదవండి ...
    (K.Haribabu,News18, Rajanna siricilla)
    రాజన్న సిరిసిల్ల (Siricilla)జిల్లా కేంద్రం వేములవాడ(Vemulawada)లో జూనియర్ బిత్తిరి సత్తి(Bittiri satti)ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వేములవాడకు చెందిన హౌ టు(How to)సాయి కుమార్(Sai Kumar)అనే యువకుడు అచ్చం బిత్తిరి సత్తి మిమిక్రీ (Mimicry)చేస్తూ అదరగొడుతున్నాడు. అతని వేషధారణ, యాస, నడక, అనుకరణ శైలి… ఇలా అన్నీటా బిత్తిరి సత్తిని దించేస్తున్నాడు. ఇతన్ని అందరూ జూనియర్(Junior) బిత్తిరి సత్తిగా పిలుస్తుంటారు.

    బిత్తిరి సత్తి…జీరో టు హీరో
    బిత్తిరి సత్తి.. ఈ పేరు తెలియని తెలుగోడు ఉండడు. తన యాస, కామెడీతో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరినీ కడుపుబ్బా నవ్వించి..వారి మన్ననలు అందుకున్నాడు. టీవీ రంగంలో జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదిగిన కమెడియన్‌. బాహుబలిలో రాజమౌళి కాలకేయుడికి కిలికిలి భాష రాసినట్లు… బిత్తిరి సత్తి తనకంటూ స్పెషల్‌ లాంగ్వేజ్‌ రాసుకున్నాడు. అది సత్తికి తప్ప ఎవ్వరికి రాదు. ఆ భాష వింటున్న మనకైతే కడుపులో బటర్‌ఫ్లయిస్‌ ఎగరకమానవు. తనదైన శైలి యాసతో విలక్షణమైన హావభావాలను పలికిస్తూ.. యావత్ తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. చిన్న పిల్లలు ఫ్యాషన్‌ కాంపీటేషన్‌లో బిత్తిరి సత్తి డ్రస్‌ స్టయిల్‌ వేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు బిత్తిరి సత్తి ప్రభావం పిల్లలపై ఎంతమేర ఉందో.

    తీన్మార్‌ ప్రోగ్రామ్‌తో సుపరిచితం
    బిత్తిరి సత్తి అసలు పేరు కావలి రవికుమార్ (చేవెళ్ల రవి). కావలి నరసింహ, యాదమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి మండలం పామెన గ్రామం. చిన్నతనంలో నాటకరంగంలో అనుభవం ఉంది. తీన్మార్ అనే కార్యక్రమంతో రవికి పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించాడు.

    మహేష్‌ను కడుపుబ్బా నవ్వించిన బిత్తిరి సత్తి
    ఈ మధ్య సినిమా స్టార్లను తనదైన స్టయిల్‌లో ఇంటర్వ్యూ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు బిత్తిరి సత్తి. RRR టీమ్‌ నుంచి మొన్న వచ్చిన సర్కారివారి పాట వరకు మూవీ ప్రమోషన్స్‌కు బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ చేశారంటే అర్థం చేసుకోవచ్చు అతనికి ఎంత క్రేజ్‌ ఉందో. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు అయితే ఇంటర్వ్యూ మొత్తం నవ్వుతూనే ఉన్నాడు సత్తన్న భాషకు. గతంలో ఎప్పుడూ మహేష్‌ని ఇంతలా నవ్వడం తాము చూడలేదంటూ మహేష్ ఫ్యాన్స్‌ బిత్తిరి సత్తికి థ్యాంక్స్‌ కూడా చెబుతున్నారు. అలా చిన్న పిల్లల నుంచి సూపర్‌ స్టార్ ల వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మన బిత్తిరి సత్తి.

    బిత్తిరి సత్తికి డూప్‌
    సినిమాల్లో సూపర్‌ స్టార్‌లకు డూప్‌లు ఉంటారు..ఆ విషయం మనకు తెలుసు. రిస్కీ సీన్స్‌, డబులు ఫ్రేమ్‌ ఉన్నప్పుడు కచ్చితంగా ఆ హీరోలకు డూప్‌లు ఉండాల్సిందే. అయితే ఇక్కడ మన బిత్తిరి సత్తికి కూడా ఓ డూప్‌ దొరికేశాడు.

    బిత్తిరిసత్తి ప్రోగ్రామ్స్‌ చూస్తూ  మారిపోయా..
    వేములవాడలో అచ్చం బిత్తిరిసత్తి వేషధారణతో ఉంటూ... బిత్తిరి సత్తి మాటలను, యాసను అనుకరిస్తూ చుట్టుపక్కల వాళ్లను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. తౌటు సాయి కుమార్(బిత్తిరి సత్తి డూప్‌) ఇంటర్మీడియట్ పూర్తి చేసి..పెంటింగ్స్ కాంట్రాక్ట్ తీసుకొని పెంటింగ్ పనులు చేస్తుంటాడు. పాన్ షాప్ కూడా నడిపిస్తుంటాడు. ప్రతిరోజు బిత్తిరిసత్తి టీవీ ప్రోగ్రాం చూసేవాడినని..తద్వారా బిత్తిరి సత్తి వేషధారణ, అనుకరించే భాష పట్ల తనకు మక్కువ ఏర్పడిందంటున్నాడు సాయి. దీంతో ఇష్టంగానే బిత్తిరి సత్తి లాగా మాట్లాడేందుకు ప్రయత్నం చేసి విజయవంతమైనట్లు సంతోషం వ్యక్తం చేస్తూ సాయికుమార్ తెలిపాడు.

    అందర్ని నవ్విస్తే నాకు హ్యాపీ : జూనియర్‌ బిత్తిరి సత్తి
    సాయికుమార్‌ మాటల్లో… వేములవాడ ప్రజలందరూ బిత్తిరి సత్తి… బిత్తిరి సత్తి అనడం పట్ల ఆనందంగా ఉంది. బిత్తిరి సత్తిని ఎప్పుడూ కలవలేదు..కలిసే అవకాశం వస్తే మాత్రం వదులుకోను. గతంలో రెండు మూడు సార్లు ఫోన్ ద్వారా బిత్తిరి సత్తి రవన్నతో మాట్లాడాను. బిత్తిరి సత్తి వేషధారణతో పట్టణం నలుమూలలా తిరిగినప్పుడు చిన్న పిల్లలు, వృద్ధులు నేను చేసే కామెడీతో హ్యాఫీగా నవ్వుకుంటారు. అది చాలు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు బిత్తిరి సత్తి లాగ చేసే కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంటారు.

    పబ్లిక్‌ ఫిగర్‌ ..
    వేములవాడ జూనియర్ బిత్తిరి సత్తి కూరగాయల మార్కెట్,కిరాణా షాపులు, సూపర్ మార్కెట్స్ లోకి వెళ్ళినప్పుడు అతను మాట్లాడే భాష యాసను, బాడీ లాంగ్వేజ్ ను చూసి చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగా చూస్తుండడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారుతోంది. తాను నవ్వుతూ తన చుట్టుపక్కల ఉన్న నలుగురిని నవ్వించడం అంటే తనకు చాలా ఇష్టమంటున్నాడు సాయికుమార్‌ అలియాస్‌ జూనియర్‌ బిత్తిరి సత్తి.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Siricilla, Telangana, Vemulawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు