జబర్దస్త్ యాంకర్, ప్రముఖ నటి అనసూయ భరద్వాజ రాజన్న సిరిసిల్లలో సందడి చేసింది. జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల షాపింగ్ మాల్ ను ప్రారంభించింది. కొత్త షూరం రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. దీంతో యాంకర్ అనసూయను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ అనసూయ కు విశాల షాపింగ్ మాల్ యాజమాన్యం కేరళ మేళం వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికి పుష్ప గుచ్చం అందజేశారు..
అనంతరం షాపింగ్ మాల్ ను ప్రారంభించి మీడియాతో అనసూయ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జబర్దస్త్ నుంచి ఎందుకు వెళ్లిపోయారని... అడిగిన మీడియ ాసిబ్బందికి అనసూయ... కొన్ని అనివార్య కారణాలు అంటూ... సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం టీవీలో చేయడం మానేసనని.. అయినా కూడా తనకు టీవీ అంటేనే ఇష్టమని చెప్పింది. అంతేకాదు అభిమానులంతా తలుచుకుంటే మళ్లీ టీవీలో కనిపిస్తానని... అంది. తన తలరాతే ఎలా ఉందో అంటూ అనసూయ సైగ చేసింది. ఆ తర్వాత... తాను కొన్ని సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
ఇక సిరిసిల్ల కు రావడం ఇదే మొదటి సారి అని చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి గాంచిన సిరిసిల్ల లో పట్టు ఫాన్సీ షోరూం ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. అయితే సిరిసిల్ల చాలా వేడిగా ఉందని.. షాపింగ్ మాల్‌లో ఏసీ ఆన్ చేయాలంటూ... అనసూయ అక్కడ వారిని కోరింది. అనసూయ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వస్తుందన్న సమాచారం తెలియడంతో ఆమెను చూసేందుకు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు తరలివచ్చారు. దీంతో షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. సెలబ్రిటీతో ఫోటోలు దిగేందుకు యువతి యువకులు ఉత్సాహం కనబరిచారు.ఈ కార్యక్రమంలో విశాల షాపింగ్ మాల్ యాజమాన్యం,కుటుంబ సభ్యులు, షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.