తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట (Yellareddy Peta)లో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. విద్యార్థులను తీసుకొని వెళ్తున్న స్కూల్ బస్సు (School Bus)ను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాల నొప్పితో విద్యార్థులు బోరున విలపించారు. గాయపడ్డ విద్యార్థులను హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం గురించి డీఈవోను కలెక్టర్ ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. తమ పిల్లలకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న తల్లిందండ్రులు ఆసుపత్రికి పరుగులు తీశారు.
విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం (Vijnan English Medium) స్కూల్ బస్సు మంగళవారం ఉదయం అల్మాస్ పూర్, రాజన్నపేట విద్యార్థులను ఎక్కించుకొని తిరిగి సిరిసిల్లకు వస్తుంది. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపేట (Yellareddy Peta) సెకండ్ బైపాస్ కార్నర్ వద్ద మూలమలుపు ఉంది. అయితే అదే సమయంలో స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు (RTC Bus)వెనకాల నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు కుదుపులకు లోను కాగా విద్యార్థులు ఒకరిపై మరొకరు పడ్డారు. మరికొంతమంది బస్సులో కడ్డీలకు, సీట్లకు తాకడంతో 15 మంది విద్యార్థులు (Students) గాయపడ్డారు. గాయాలబారిన పడ్డ విద్యార్థులు నొప్పికి తట్టుకోలేక బోరున ఏడ్చారు.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్కూల్ యజమాని ఎండి లతీఫ్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ విద్యార్థులను స్థానిక అశ్విని ఆసుపత్రిలో (Ashwini Hospital) చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు అంత సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి ఢికొట్టడంతో ప్రమాదం జరగగా ఆ సమయంలో ఒకవేళ స్కూల్ బస్సు (School Bus) బోల్తా పడితే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సు అతి వేగంతో వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదంలో విద్యార్థుల ప్రాణాలకు ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదంలో మా పిల్లలకు ఏమైందని తల్లిందండ్రులు ఆసుపత్రికి పరుగులు తీశారు. చికిత్స పొందుతున్న వారిని చూసి వారికి కన్నీళ్లు ఆగలేదు. అయితే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాల ఏంటని ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Schools, Telangana