(K.Haribabu,News18, Rajanna siricilla)
వృద్ధాప్యంలో (Ola age) ఆసరాగా ఉంటుందని ప్రభుత్వమే పేద వృద్ధులకు పింఛన్ (Asara pension) పంపిణీ చేస్తుంది. అయితే ఈ పంపిణీ వ్యవస్థలో నెలకొన్న కొన్ని సమస్యల కారణంగా పలు చోట్ల వృద్ధులకు (Old people) పింఛన్ అందడం లేదు. నెలనెలా వచ్చే పింఛన్ హఠాత్తుగా ఆగిపోవడంతో ఓ వృద్ధుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. విషయం తెలుసుకుందామని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన వృద్ధుడు అక్కడి సిబ్బంది చెప్పింది విని కంగుతిన్నాడు. "నీవు చనిపోయావంటూ తమ రికార్డుల్లో నమోదు అయింది. అందుకే నీకు పింఛన్ రావడం లేదంటూ" గ్రామ పంచాయితీ సిబ్బంది చెప్పిన మాటలు విని అవాక్కయ్యాడు ఆ వృద్ధుడు.
వేములవాడ (Vemulawada) మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కొమురయ్యకు 2018 నుండి వృద్ధాప్య పింఛన్ మంజూరు అయింది. ఆనాటి నుండి ప్రతి నెల పెన్షన్ వస్తుండేది. 2020లో కొమురయ్య మృతి చెందినట్లు రికార్డుల్లో నమోదు కావడంతో అప్పటి నుండి అతని పింఛన్ ఆగిపోయింది. తనకు పింఛన్ రావడం లేదని గ్రహించిన కొమురయ్య గ్రామ పంచాయతీకి (Grama Panchayati) వెళ్లి ఆరా తీయగా విషయం తెలుసుకుని కంగుతిన్నాడు. పింఛన్ విషయమై గత కొన్ని రోజులుగా వేములవాడ రెవెన్యూ కార్యాలయం చుట్టూ, సిరిసిల్ల ఆర్డిఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించారు. తనకు ఎప్పటిలాగే పింఛన్ మంజూరు చేసి, తనను ఆదుకోవాలని మీడియా సాక్షిగా అధికారులను వేడుకున్నాడు.
ఘటన పై స్పందించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి:
రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లావేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామానికి చెందిన కొమురయ్య పెన్షన్ తొలగింపు ఘటనపై సోమవారం పలు మీడియాల్లో వచ్చిన కథనాలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Collector Anurag Jayanthi) స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించగా, ఏడీఆర్‌డీఓ మదన్ మోహన్ విచారణ చేసి ప్రాథమిక రిపోర్ట్ అందజేశారు. 2019లో అప్పటి పంచాయతీ కార్యదర్శి తమ లాగిన్‌లలో పొరపాటున మరణం అని పేర్కొంటూ వృద్దుడు కొమురయ్య పింఛను తొలగించారు.
Telangana Debt: మళ్లీ అప్పు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వచ్చే వారమే బాండ్ల వేలం!
పొరపాటును అప్పుడే గుర్తించి పెన్షన్ (Asara pensions) పునరుద్దరణ చేయాలనీ సెర్ఫ్ సీఈఓకు నివేదించామని అయితే ఇప్పటికీ పునరుద్ధరించలేదనీ నివేదించారు. కొమురయ్య పింఛన్ విషయమై మరోసారి లేఖ పంపామని త్వరలోనే వృద్దుడు కొమురయ్యకు తిరిగి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aasara pension, Local News, Siricilla, Vemulawada