హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: ప్రారంభించారు, పక్కన పడేశారు.., నిరుపయోగంగా సంచార మహిళా బయో టాయిలెట్

Rajanna Siricilla: ప్రారంభించారు, పక్కన పడేశారు.., నిరుపయోగంగా సంచార మహిళా బయో టాయిలెట్

X
రాజన్న

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల నిర్వాకం

మహిళల కోసం వేములవాడ మున్సిపాలిటీలో ఈ సంచార బయో టాయిలెట్ బస్సును మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు గతంలో ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా..రూ. లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన షీ మొబైల్ బయో టాయిలెట్ బస్సు నిరుపయోగంగా మారింది

  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla | Karimnagar | Peddapalle

Haribabu, News18, Rajanna Siricilla

ప్రభుత్వం చేపట్టే పనులు ప్రజలకు ఉపయోగపడాలి.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినవి జనానికి పనికొచ్చేలా ఉండాలి. అలాఅని ఎవరు నిర్లక్ష్యం వహించినా అవి పనికిరాకుండా పోతాయి. ప్రజాధనం వృథా అవుతుంది. మంత్రి కేటీఆర్ (Minister KTR) గతంలో వేములవాడ (Vemulawada) పట్టణంలో షీ మొబైల్ బయో టాయిలెట్ బస్సును ప్రారంభించారు. షీ మొబైల్ బయో టాయిలెట్ బస్సులో పసిపిల్లలకు డైపర్ మార్చే రూమ్, బేబీ ఫీడింగ్ రూమ్, సోలార్ లైటింగ్ సిస్టం, బయో టాయిలెట్ వంటివి ఏర్పాటు చేశారు. మహిళల కోసం వేములవాడ మున్సిపాలిటీలో ఈ సంచార బయో టాయిలెట్ బస్సును మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు గతంలో ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా..రూ. లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన షీ మొబైల్ బయో టాయిలెట్ బస్సు నిరుపయోగంగా మారింది. పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో ఓ మూలన దర్శనమిస్తోంది బస్సు.

ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బస్సు నిరుపయోగంగా మారింది. బస్సుపై ఉన్న సోలార్ సిస్టం, వాటర్ ట్యాంకులు ధ్వంసం అయ్యే అవకాశం ఉంది. పట్టించుకునే వారు లేక ఒక మంచి సౌకర్యం మరుగునపడిపోతుండడంపై పట్టణ ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ ప్రాంతంలో గల కూరగాయల మార్కెట్ సమీపంలో సైతం ఎలాంటి పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి మహిళల కోసం ఏర్పాటు చేసిన సంచార బయో టాయిలెట్ బస్సును వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.

ఇది చదవండి: ఆర్మీ , పోలీస్ అభ్యర్థులకు ఉచిత ఫిజికల్ శిక్షణ ఇస్తున్న కానిస్టేబుల్.. ఈయన సేవలకు సలాం కొట్టాలి..!

వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఉండే సమయాల్లో రోజుల్లో ఈ సంచార బయో టాయిలెట్ బస్సులు ఉపయోగించడం ద్వారా మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని మహిళా భక్తులు చెబుతున్నారు. దాని ఉపయోగించకుండా మూలన వేయడంతో, ఉపయోగంలో లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటుందని, ప్రజాధనంతో ఏర్పాటుచేసిన షి మొబైల్ బయో టాయిలెట్ బస్సును వినియోగంలోకి తేవాలని రాజన్న భక్తులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.

దీనిని సోమవారం, శుక్రవారం ఆదివారం సమయాల్లో రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలో గాని పరిసర ప్రాంతంలో గాని వినియోగంలో ఉంచితే మహిళా భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని రాజన్న భక్తులు,పట్టణ ప్రజలు చెబుతున్నారు. వెంటనే మున్సిపల్ సంబంధిత అధికారులు స్పందించి షీ మొబైల్ బయో టాయిలెట్ బస్సులు వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.

First published:

Tags: Local News, Sircilla, Telangana

ఉత్తమ కథలు