Home /News /telangana /

RAJANNA SIRCILLA A WEAVER FROM SIRCILLA WEAVES A SAREE EXPLAINING NETANNA BHEEMA SCHEME RECIEVED APPLAUSE BRV ABH RKH

Rajanna Sircilla: ఔరా అద్భుత కళ.. ప్రభుత్వ పథకాన్ని వివరిస్తూ చీర నేసిన చేనేత కార్మికుడు

ఔరా

ఔరా అద్భుత కళ

ఈనేపధ్యంలో ప్రభుత్వం తమ కోసం తీసుకువచ్చిన ఈ పథకానికి మరింత ప్రచారం కల్పిస్తూ.. ఈ పథకం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఓ చేనేత కార్మికుడు అద్భుత ప్రతిభ ప్రదర్శించాడు

  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    (K.Haribabu, News 18, Rajanna Sircilla)

    చేనేతలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నేతన్న బీమా పథకం ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు చేనేత కార్మికుడు మరణిస్తే ఆయా కుటుంబాన్ని ఆదుకునేలా ఆర్ధిక పరిహారం అందేలా ఈ నేతన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈనేపధ్యంలో ప్రభుత్వం తమ కోసం తీసుకువచ్చిన ఈ పథకానికి మరింత ప్రచారం కల్పిస్తూ.. ఈ పథకం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఓ చేనేత కార్మికుడు అద్భుత ప్రతిభ ప్రదర్శించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన నేత కార్మికుడు  హరిప్రసాద్ మరమగ్గాలపై వినూత్న కళాకృతుల్లో బట్టలు నేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.

    అగ్గిపెట్టెలో ఇమిడే చీర, ఉంగరం, దబ్బనం రంద్రంలో నుంచి లాగగలిగేలా అతి పలుచని వస్త్రం, ఇలా తన ప్రతిభను చాటేలా ఎన్నో బట్టలు నేశాడు హరిప్రసాద్. ఈక్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో ప్రారంభించనున్న నేతన్నల జీవిత బీమా పథకం గురించి వివరిస్తూ, మగ్గంపై చీరను నేసి అబ్బురపరుస్తున్నాడు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్ర పటాలను ఎంతో ఖచ్చితత్వంతో వచ్చేలా చీరపై నేశాడు. హరిప్రసాద్ గతంలో అగ్గి పెట్టెలో ఇమిడే రాట్నం, అగ్గిపెట్టెలో ఇమిడే చీర, ఉంగరములో, దబ్బనం రంద్రంలో దూరే చీరను నేసి తన ప్రతిభను చాటుకున్నాడు. అగ్గిపెట్టెలో ఇమిడే వస్త్రాలను వేములవాడ శ్రీ పార్వతీరాజరాజేశ్వర స్వామి వార్లకు బహుకరించాడు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అగ్గిపెట్టలో ఇమిడే లుంగీ, అంగినీ తయారు చేశాడు హరిప్రసాద్. అందుకు గానూ కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డు కూడా అందుకున్నాడు. మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా చేనేత కార్మికుడు హరిప్రసాద్‌ను అభినందించారు.

    నేతన్నకు బీమా పథకం గురించి కొన్ని వివరాలు:
    1. దేశంలో ఎక్కలేని విధిగా తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే నేత కార్మికులకు బీమా
    2. దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే రూ. 5 లక్షల వరకు బీమా పరిహారం.
    3. ప్రభుత్వ బీమాతో నేత కార్మికులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా
    4. 60 సంవత్సరాలలోపు ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడు
    5. రాష్ట్రంలోని సుమారు 80,000 మంది నేత కార్మికులకు లబ్ధి చేకురనుంది

    అవకాశం ఇస్తే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు బహుకరిస్తా: హరిప్రసాద్
    నేతన్నకు బీమా పథకాన్నీ వివరిస్తూ ఓ పక్క సీఎం కేసీఆర్, మరో పక్క మంత్రి కేటీఆర్ చిత్రాలు వచ్చేలా చీర నేశాడు హరిప్రసాద్. ఇందుకోసం నాలుగు రోజులు కష్టపడ్డానని న్యూస్ 18తో అన్నాడు హరిప్రసాద్. అవకాశం ఇస్తే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఈ చీరను బహుకరిస్తాననీ చేనేత కార్మికుడు తెలిపాడు. చేనేత కార్మికుడు హరిప్రసాద్ నేసిన నేతన్నకు భీమా పథకం.. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చీరపై నేతన్నకు బీమా పథకాన్ని ఆవిష్కరించిన చేనేత కళాకారున్ని పలువురు అభినందిస్తున్నారు.చేనేత కార్మికుడు వెల్డి హరిప్రసాద్ ఫోన్ నెంబర్ +91-94400 49734
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు