Home /News /telangana /

RAJANNA SIRCILLA A MINI TANK BUND DESIGNED NEAR THE POND IN RAJANNA SIRICILLA DISTRICT WHICH IMPRESSES THE CITY DWELLERS RKH NJ PRV

Mini Tank bund: సిరిసిల్లలో చెరువునే మినీ ట్యాంక్​ బండ్​గా మార్చిన అధికారులు.. క్యూ కడుతున్న జనం

మిని

మిని ట్యాంక్‌ బండ్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కొత్తశోభను సంతరించుకుంది. అధునాతన హంగులతో సిరిసిల్లలో ఏర్పాటుచేసిన మినీ ట్యాంక్ బండ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మినీ స్టేడియం, మినీ ట్యాంక్‌ బండ్‌లు ప్రజల ముంగిటకొచ్చాయి. అక్కడ వాతావరణం నగరవాసులను ఆకట్టుకుంటుంది.

ఇంకా చదవండి ...
    (K. haribabu, Nes 18, Rajanna siricilla)

    సిరిసిల్ల (Siricilla) పట్టణంలో కొత్త చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా తీర్చిదిద్ది కొత్త అందాలను తీసుకొచ్చారు. రూ.13.25 కోట్ల వ్యయంతో 72 ఎకరాల కొత్త చెరువును మినీ ట్యాంక్‌బండ్‌ (Mini Tank Bund)గా తీర్చిదిద్దారు. పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదాన్ని అందించే విధంగా నాలుగు ఎకరాల్లో పార్కును నిర్మించారు. 1.8 కిలోమీటర్ల మేరకు బండ్‌ నిర్మాణం చేపట్టారు. బండ్‌ అభివృద్ధిలో ఫ్లోరింగ్‌, లైటింగ్‌, రెయిలింగ్‌, యోగా పెవిలియన్‌, ట్రెన్‌ ప్లాట్‌ ఫాం, టన్నెల్‌, కూర్చోవడానికి షెడ్లు, ఫ్లాంటేషన్‌, వంటివి ఏర్పాటు చేశారు.

    నాలుగు ఎకరాల పార్కు

    నాలుగు ఎకరాల పార్కులో ట్రెయిన్‌, సీతాకోకచిలుకల తోట, చిట్టడివి, ఫౌంటేన్‌, వ్యూపాయింట్‌ డెక్‌, జిప్‌ లైన్‌, జిప్‌ సైకిల్‌, విమానం ఫ్లయిడ్‌, మ్యూజిక్‌ గార్డెన్‌, కమాండో నెట్‌, మొసలి స్లయిడ్‌, వంటివి ఏర్పాటు చేశారు. వీటికి తోడుగా త్వరలోనే ఊగే వంతెనను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక హంగులతో తయారైన మినీ ట్యాంక్‌బండ్‌ ప్రజల ముంగిటకు వచ్చింది.

    పిల్లల కోసం బోటింగ్‌, రైల్వే ట్రాక్‌

    తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రత్యేక ఆకర్షణగా మినీ ట్యాంక్ బండ్ (Mini Tank bund) ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, చుట్టూ గ్రీనరీ, రంగురంగుల విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేశారు. పిల్లల కోసం రైల్ ట్రాక్, బోటింగ్ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. మినీ ట్యాంక్ బండ్ ఆవరణలో ఫుడ్ కోర్ట్ అందుబాటులో ఉంది.

    క్రీడాకారుల కోసం మినీ స్టేడియం

    ఇండోర్ కోర్టుతో పాటు అవుట్ డోర్ అన్ని హంగులతో మినీ స్టేడియం రాజన్న సిరిసిల్ల జిల్లాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సిరిసిల్ల శివారులో చిన్నబోనాల వద్ద 4.30 ఎకరాల స్థలంలో రూ.5 కోట్లతో మినీ స్టేడియంనిర్మించారు. క్రీడాకారులను ఆకర్షించే విధంగా ఆర్చ్‌ ఏర్పాటు చేశారు. మౌలిక సదుపాయాలను కల్పించారు. మిరుమిట్లు గొలిపే లైటింగ్‌తో క్రీడాభవనాన్ని తీర్చిదిద్దారు.

    పార్కింగ్‌, హైమాస్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఫౌంటేన్‌వద్ద అందమైన శిల్పాలు ఏర్పాటు చేశారు. స్టేడియంలో టేబుల్‌ టెన్నిస్‌, పుట్‌బాల్‌, స్నూకర్‌ టేబుళ్లు, స్లాండ్‌తో కూడిన క్యారంబోర్డు, చెస్‌బోర్టు, బ్యాడ్మింటన్‌ కోర్టు, స్టాండ్‌తో లూడో బోర్డులు, వాలీబాల్‌ కోర్టు, లాంగ్‌జంప్‌, టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌, కబడ్డీ, హైజంప్‌, ఆర్చరీతోపాటు క్రికెట్‌ ప్రాక్టీస్‌ కోసం నెట్‌లను సమకూర్చారు.

    పిల్లల కోసం ప్రత్యేకం

    పిల్లల కోసం కూడా స్లాయిడ్స్‌ లాంగ్‌ కోర్టు, పుట్‌బాల్‌, హాకీ, డిస్క్‌ త్రోయింగ్‌ వంటి పరికరాలను సమకూర్చారు. ఔట్‌డోర్‌, ఇండోర్‌ కోర్టులతోపాటు అన్ని హంగులను సమకూర్చారు. మినీ స్టేడియం సిరిసిల్లకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇండోర్ కోర్టుతో పాటు అవుట్ డోర్ అన్ని హంగులతో మినీ స్టేడియం రాజన్న సిరిసిల్ల జిల్లాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

    ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం

    బ్యాక్‌ వాటర్‌ వద్ద రోప్‌వేలు, కాటేజీల నిర్మాణానికి ప్రాజెక్ట్‌ రూపొందించారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో వార్డుల్లో మినీ పార్కులు నిర్మించారు. ఈ ప్రత్యేక హంగులతో ఏర్పాటుచేసిన మినీ ట్యాంక్ బండ్ చూపరులను, సందర్శకులను ఆకట్టుకుంటోంది. చిన్న చిన్న ఫంక్షన్‌లు చేసుకునేందుకు వేదికను సైతం ఏర్పాటు చేయడం పట్ల సిరిసిల్ల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    ఎలా వెళ్లాలి?

    ఈ మిని ట్యాంక్‌ బండ్‌ సిరిసిల్ల - కరీంనగర్‌ ప్రధాన రహదారిలో ఉంది. సిరిసిల్ల నుంచి లోకల్‌ ఆటో, బస్సులో అక్కడకు వెళ్లొచ్చు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Local News, Siricilla, Tank Bund

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు