హోమ్ /వార్తలు /తెలంగాణ /

Aasara Pensions: దుర్మార్గుడు: పింఛన్ ఇప్పిస్తానంటూ నిస్సహాయురాలి వద్ద డబ్బులు దండుకున్నాడు

Aasara Pensions: దుర్మార్గుడు: పింఛన్ ఇప్పిస్తానంటూ నిస్సహాయురాలి వద్ద డబ్బులు దండుకున్నాడు

బాధితురాలు

బాధితురాలు

అమ్మా నీకు పింఛన్ వస్తోందా నేను కార్యదర్శిని, నన్ను గుర్తుపట్టావా అంటూ ఓ దుర్మార్గుడు నిస్సహాయ స్థిత్లో ఉన్న వృద్ధురాలి వద్ద అందినకాడికి దండుకుని పారిపోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Haribabu, News18, Rajanna Sircilla)


  అమ్మా నీకు పింఛన్ (Aasara Pension) వస్తోందా నేను కార్యదర్శిని, నన్ను గుర్తుపట్టావా అంటూ ఓ దుర్మార్గుడు నిస్సహాయ స్థిత్లో ఉన్న వృద్ధురాలి వద్ద అందినకాడికి దండుకుని పారిపోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. పోత్గల్‌కు చెందిన పుట్ట లక్ష్మి (Putta Lakshmi) వద్దకు శుక్రవారం ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. తను కార్యదర్శినంటూ (Secretary) పింఛన్ వస్తుందా? లేదా? అని ప్రశ్నించాడని తెలిపింది. తన భర్త చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది.. కానీ పింఛన్ రావడం లేదని బాధితురాలు తెలిపింది. దీంతో పింఛన్ ఇప్పించే భాద్యత నాది అంటూ ఆ దుర్మార్గుడు నమ్మబలికాడు. రూ.15 వేలు పింఛన్ ఇప్పిస్తానని నమ్మబలికి ఇందుకు రూ.7,500 ఖర్చు అవుతుందని తెలపడంతో డబ్బులు ఇచ్చానని, పేపర్లు తీసుకుని పంచాయతీ ఆఫీస్‌కు రమ్మని వెళ్లిపోయాడని బాధితురాలు పేర్కొంది. తీరా అక్కడికి వెళితే కార్యదర్శి అనేవారు లేరని సిబ్బంది చెప్పడంతో జరిగిన మోసాన్ని తెలుసుకుని బాధితురాలు లబోదిబోమంది. గతంలో ముస్తాబాద్, ఆవునూర్, పోత్గల్ గ్రామాల్లో పింఛన్లు ఇప్పిస్తామంటూ పలువురు అపరిచితులు మోసాలకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు.


  విషజ్వరంతో యువకుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం...మండలకేంద్రానికి చెందిన నడిగట్ల మనోహర్ (26) హైదరాబాద్‌లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎమ్మెస్సీ కంప్యూటర్ చదువుతున్నాడు. గత 5 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మనోహర్ వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటున్నాడు. జ్వరం తగ్గుముఖం పట్టకపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం తెల్లవారుజామున కరీంనగర్తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.  Telangana: టీఆర్​ఎస్​ లీడర్లకు మావోయిస్టుల హెచ్చరిక..! డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్​


  మనోహర్ మృతితో తల్లిదండ్రులు జమున - పురుషోత్తం,కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషజ్వరంతో మృతి చెందాడన్న వార్త గ్రామస్తులను తీవ్రంగా కలిచి వేస్తోంది. డెంగ్యూతో యువకుడు మృతి చెందాడని గ్రామంలో చర్చించుకుంటున్నారు. దీనిపై స్పందించిన మండల వైద్యాధికారి మసూద్ హైమద్.. విష జ్వరంతో డెంగ్యూతో యువకుడు మృతి చెందలేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటూ.. పౌష్టికాహారాన్ని భుజించాలని సూచించారు. ఏమైనా వైరల్ ఫీవర్స్ వస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు వైద్యులను సంప్రదించాలని అన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Aasara pension, Local News, Rajanna, Siricilla

  ఉత్తమ కథలు