హోమ్ /వార్తలు /తెలంగాణ /

Siricilla: 50 దేశాల రాజధానులను గలగలా చెప్పేస్తున్న నాలుగేళ్ళ చిన్నారి

Siricilla: 50 దేశాల రాజధానులను గలగలా చెప్పేస్తున్న నాలుగేళ్ళ చిన్నారి

X
మేధా

మేధా శక్తితో ప్రత్యేకత చాటుకున్న చిన్నారి

Siricilla: పిట్ట కొంచెం కూత ఘనం సామెతకు సరిగ్గా సరిపోతుంది ఈ చిన్నారికి..పిల్లలకు బాల్యం నుండి తల్లి,దండ్రులు వారికి ఉన్న ప్రతిభను గుర్తించి శిక్షణ,ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైన అద్బుతంగా రాణిస్తారు అనడానికి తార్కానంగా నిలుస్తుంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

K.Haribabu,News18, Rajanna siricilla.

పిట్ట కొంచెం కూత ఘనం సామెతకు సరిగ్గా సరిపోతుంది ఈ చిన్నారి. పిల్లలకు బాల్యం నుండి తల్లిదండ్రులు వారికి ఉన్న ప్రతిభను గుర్తించి శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైన అద్బుతంగా రాణిస్తారు. అనడానికి తార్కానంగా నిలుస్తుంది. వివరాల్లోకెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన బొనగిరి స్వర్ణలత-అభిలాష్ దంపతుల కుమార్తె శ్రీతిక ఏకసంథాగ్రహి అనే చెప్పాలి.

తల్లిదండ్రులు ఏదైనా ఒక్కసారి చెబితే గుర్తుంచుకుని వెంటనే అప్పచెప్పేస్తుంది. చిన్నారి ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు పాపకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. సరిగ్గా మాటలు కూడా రాని ఈ చిన్నారి (బోసి నోటితో) పాల పలుకులతో జాతీయగీతం, సంపూర్ణ జనగణమన పొల్లుపోకుండా ఆలపిస్తూ.. అందరిని అబ్బురపరుస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాదండోయ్ బాబు...50 దేశాల రాజధానుల పేర్లను అనర్గళంగా చెబుతోంది. ఈ చిన్నారి పలుకులు విన్న పలువురు ఆచర్యపోతున్నారు. ఈ పాప అదే గ్రామంలోని వాసవి విద్యాలయంలో LKG చదువుతుంది. చిన్నారి ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు నర్సరీ చదవకుండానే LKG లో జాయిన్ చేశారంటే అతిశయోక్తి కాదు.

పాఠశాల కరస్పాండెంట్ గుండా రామచెంద్రం న్యూస్ 18 ద్వారా చిన్నారి ప్రతిభను, మేధో సంపత్తిని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నారు. దీంతో పిల్లలలో సహజమైన లేదా, దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడం మన కర్తవ్యమని పాఠశాల కరస్పాండెంట్ అన్నారు. \"ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ\"చిన్నారి ప్రతిభను గురించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

అనార్దళంగా జాతీయ గీతాలాపనతో పాటు జనగణమన,40-50 దేశాల రాజధానుల పేర్లను చెబుతూ అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది LKG చిన్నారి..

నర్సరీ చదువుతున్న చిన్నారి తన మేదో శక్తితో ప్రతిభతో LKG కి ప్రమోట్ అయింది వండర్ కిడ్. చిన్నారుల తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి వారికి క్రమశిక్షణ అలవర్చడం ద్వారా విద్యార్థులు పిల్లలు సక్రమ మార్గంలో ప్రయాణించి దేశ అభివృద్ధికి పాటుపడతారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చిన్నారిని పాఠశాల ఉపాధ్యాయులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు.

Shocking: చెత్తను వీధుల్లో వేసే వారికి షాక్.. ఉదయం 8 తర్వాత చెత్త వేస్తే రూ. లక్ష ఫైన్.. ఎక్కడంటే..

చిన్నారి శ్రీతిక మేధాశక్తిని చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని అందరూ ఏకసంతాగ్రహి అంటూ మెచ్చుకుంటున్నారు. అతి చిన్న వయసులోనే చిన్నారి ఇంత మేధాశక్తి ఉండడం గొప్ప విషయమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చిన్నారి ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తుందని పేర్కొన్నారు. చిన్నారి మేధాశక్తికి ప్రతి ఒక్కరూ అభినందించకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు