హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: చెత్త చెదారంతో దుర్గంధం వెదజల్లుతున్న మూలవాగు

Rajanna Siricilla: చెత్త చెదారంతో దుర్గంధం వెదజల్లుతున్న మూలవాగు

X
చెత్త

చెత్త చెదారంతో మూలవాగు దుర్గంధం

Telangana: ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ప్రకృతి ప్రసాదించిన మూలవాగు.. వేములవాడ పట్టణంలోని ములవాగు మురికినీటితో కలుషితమవుతోంది. కొన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతున్నప్పటికి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడనే చెప్పాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

K.Haribabu,News18, Rajanna siricilla

ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ప్రకృతి ప్రసాదించిన మూలవాగు..

వేములవాడ పట్టణంలోని ములవాగు మురికినీటితో కలుషితమవుతోంది. కొన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతున్నప్పటికి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడనే చెప్పాలి. దీంతో స్వచ్ఛమైన నీరు కళ్లముందే కలుషితమవుతోందని ప్రజలు వాపోతున్నారు. ఇదంతా అధికారులు, పాలకులు చూస్తున్నా మురుగునీటిని దూర ప్రాంతాలకు తరలించే పని మాత్రం చేపట్టడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేములవాడ పట్టణ ప్రజలను మురుగునీరు వెంటాడుతోంది. గ్రామ పంచాయతీ నుంచి క్రమంగా మున్సిపాలిటీగా మారినా మురికినీటిని (బయట)ఇతరప్రాంతాలకు తరలించే ప్రక్రియ ఆరంభం కాకపోవడం శోచనీయం.

పట్టణం నుంచి వెలువడే మురుగునీరంతా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మూలవాగులోకి చేరడంతో అపరిశుభ్రంగా అధ్వానంగా దర్శనమిస్తుంది. దీంతో చుట్టుపక్కల ప్రజల సైతం దుర్గంధం వస్తుందని వాపోతున్నారు. వేములవాడ పట్టణంలోనిసాయినగర్, విద్యానగర్, సుభాష్ నగర్, మార్కెట్ ఏరియా, బద్దిపోచమ్మవీధి, జాతరగ్రాండ్ గాంధీనగర్ ఉప్పుగడ్డ, ముదిరాజ్, అంబేడ్కర్ నగర్, మహాలక్ష్మివీధి ప్రాంతాల మురుగునీరంతా మూలవాగులోకి చేరడంతో మురికిగా మారి దర్శనమిస్తుంది.

దీంతో భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూల వాగులో పట్నంలోని పలు వార్డుల డ్రైనేజీ నీరు కలవడం, దానికి తోడు కూరగాయల మార్కెట్ మూల వాగును అనుకుని ఉండడం కూరగాయల వ్యర్ధాలు కొందరు అవగాహన లోపంతో మూల వాగులో పడి వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఏదేమైనప్పటికీ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత... మూల వాగులో డ్రైనేజీ వాటర్ కలుస్తున్నాయని న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ను వివరణ కోరగా.. మున్సిపల్ పాలకవర్గం అధికారులతో చర్చించి మూలవాల్లో డ్రైనేజీ వాటర్ శుద్ధి ప్రక్రియకు సంబంధించి (STP) శుద్ధి చేసిన వాటర్ ను మాత్రమే పంపించే ప్రక్రియ ఉందని.. దాన్ని కార్యరూపం దాల్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

వేములవాడ పట్టణ ప్రజలు స్వచ్ఛ వేములవాడకు సహకరించాలని ప్రజలందరూ సహకారంతోనే సాధ్యమవుతుంది అని అన్నారు. ప్రతి ఒక్కరు మున్సిపల్ చెత్త వాహనానికి తడి మరీ పొడి చెత్త ఇవ్వాలని సూచించారు. మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతను గుర్తు చేశారు. గతంలోని కలెక్టర్ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబుల దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

వేములవాడ ప్రొఫైల్...

జనాభా..45 వేల పైచిలుకు, ఇండ్లు..10 వేలకు పైగానే, ఓపెన్ డ్రెయినేజీ 65 కిలో మీటర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తే ఈ సమస్య తప్పుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 50 కోట్ల నిధులు వెచ్చించి గతంలోనే ఈ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు చేసిన్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరాన్ని పాలకవర్గంతో చర్చించి, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. ప్రతిరోజు వేములవాడ రాజన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు.

వేములవాడ చేరుకోగానే మూల వాగు మురికి నీటితో దుర్గంధ భరితంగా దర్శనం ఇవ్వడంతో రాజన్న భక్తులు సైతం మున్సిపల్ పాలకవర్గం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ మున్సిపాలిటీకి సిటిజన్ ఫీడ్ బ్యాక్ కింద స్వచ్ఛభారత్ అవార్డు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. వేములవాడకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడమే పెద్ద సమస్యగా మారిందని ప్రజలు చెబుతున్నారు. వెంటనే మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబులు ప్రత్యేక చొరవ తీసుకొని వేములవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు