హోమ్ /వార్తలు /తెలంగాణ /

15 గొర్రెలను కరిచి చంపిన కుక్కలు.. ఆదుకోవాలంటూ రైతు కన్నీళ్లు

15 గొర్రెలను కరిచి చంపిన కుక్కలు.. ఆదుకోవాలంటూ రైతు కన్నీళ్లు

X
కన్నీళ్లు

కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతు

వీధి కుక్కలను నియంత్రించడంలో మండల ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోని, కుక్కల బారి నుంచి మండల ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India

రిపోర్టర్ : హరిబాబు

లొకేషన్ : వేములవాడ

శునకాల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండల కేంద్రంలోని బావుసాయిపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బావుసాయిపేట గ్రామానికి చెందినఎక్కలదేవి పర్వతాలు తనకు ఉన్న గొర్ల మందను మేపడానికి వెళ్తూ.. గొర్రె పిల్లలను జాలిలతో కట్టిన దొడ్లో ఉంచి వెళ్లారు. అయితే, సుమారుగా పది కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేయడంతో సుమారు పదిహేను గొర్రె పిల్లలు మృతి చెందాయి. గొర్లను కాసుకుంటూ అవే జీవనాధారంగా తమ కుటుంబం బ్రతుకుతుందని, వీధి కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేసి చంపేశాయని.. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్యే రమేష్ బాబులు స్పందించి నష్ట పరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.

 Mahabubnagar: పాలమూరులో సేంద్రీయ ఉత్పత్తుల వేదిక

ఇదే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోనికోనరావుపేట మండల నిమ్మపల్లి గ్రామంలో పిచ్చి దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన గన్నారపు కిష్టయ్య, గన్నారపు సాగర్, కమ్మరి పోచవ్వలు పిచ్చి కుక్క దాడిలో గాయపడ్డారు. ముగ్గురికి చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో వారికి ప్రథమ చికిత్స చేయించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మెరుగైనా చికిత్స కోసం స్థానికులు తరలించారు. ఉగాది పండుగ పురష్కరించుకోని పోచవ్వ ఇంటి ముందు పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారి పిచ్చి కుక్క దాడికి పాల్పడింది. దీంతో కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు రావడంతో కుక్క పారిపోయింది. పోచవ్వకు పెద్ద ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పోచవ్వ ఇంటి పక్కనే ఉన్న గన్నారపు కిష్టయ్య, గన్నారపు సాగర్లకు పిచ్చి కుక్క దాడిలో చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి.

కాగా స్థానికంగా ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ, అందుబాటులో ఉండాల్సిన ఏఎన్ఎం మాత్రం ఉండడం లేదు. నిత్యం జిల్లా కేంద్రం నుంచి ఆమె రావాల్సి ఉంది. పండుగా సందర్భంగా ఏఎన్ఎం సరోజ లేకపోవడంతో గాయపడ్డ వారిని కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందించారు. ఇలా మండలంలో ఏదో ఒక చోట కుక్కల దాడిలో పలువురికి గాయాలు అవుతున్నప్పటికి అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్షం రోజుల క్రితం కోనరావుపేట, ఎగ్లాస్పూర్ గ్రామాల్లో కుక్కలదాడిలో పలువురికి గాయపడ్డ ఘటన మరువక ముందే నిమ్మపల్లి ఘటన చోటు చేసుకుంది.

వీధి కుక్కలను నియంత్రించడంలో మండల ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోని, కుక్కల బారి నుంచి మండల ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదేవిధంగా కుక్కల దాడిలో గాయపడ్డ వారికి ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని వైద్యాధికారులను స్థానికులు కోరుతున్నారు.

First published:

Tags: Local News, Rajanna sircilla

ఉత్తమ కథలు