హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu: మునుగోడులో బీజేపీని గెలిపిస్తే.. నెలరోజుల్లో టీఆర్​ఎస్​ ప్రభుత్వం కూలుతుంది: కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి

Munugodu: మునుగోడులో బీజేపీని గెలిపిస్తే.. నెలరోజుల్లో టీఆర్​ఎస్​ ప్రభుత్వం కూలుతుంది: కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

మునుగోడులో బీజేపీని గెలిపిస్తే కేసీఆర్​ నేతృత్వంలోని టీఆర్​ఎస్​ ప్రభుత్వం నెలరోజుల్లో కూలిపోతుందని రాజగోపాల్​ రెడ్డి జోస్యం చెప్పారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nalgonda, India

  మునుగోడు (Munugodu). గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఆసక్తి రేకెత్తిస్తున్న నియోజకవర్గం. కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి  (Komatireddy Rajagopal reddy) రాజీనామాతో అక్కడ మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఇది కేవలం ఉప ఎన్నిక మాత్రమే కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పునకు రెఫరెండంగా రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. ఈనెలలో జరిగిన సీఎం కేసీఆర్ (CM KCR) మీటింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన, రేవంత్ రెడ్డి ప్రచారం.. ఇపుడు జేపీ నడ్డా బహిరంగ సభ ఇలా ప్రధాన పార్టీల నేతలందరూ మునుగోడు వైపే చూస్తున్నారు. ఇప్పటికే వలసలతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. మునుగోడు నియోజకవర్గంలో గెలిచేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న TRS మునుగోడుపై  ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. తాజాగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Rajagopal reddy) వ్యాఖ్యలు ఆసక్తి రెకెత్తిస్తున్నాయి.


  ఇంటికి కిలో బంగారం ఇచ్చినా..


  దేశం మునుగోడు వైపే చూస్తుందని… టీఆర్ఎస్ (TRS) పార్టీ లో చేరితెనే ఎమ్మెల్యే లకు కేసీఅర్ అపాయిట్మెంట్ ఇస్తాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు మునుగోడును వదిలిపెట్టబోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.టిఆర్ఎస్ (TRS) పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు వారి నియోజక వర్గ సమస్యల గురించి కేసీఆర్ ను అడిగే దమ్ముందా ? అని సవాల్‌ చేశారు. ఇంటికి కిలో బంగారం ఇచ్చిన టిఆర్ఎస్ కు ప్రజలు ఓటెయ్యరని.. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.  మునుగోడులో బీజేపీని గెలిపిస్తే కేసీఆర్​ నేతృత్వంలోని టీఆర్​ఎస్​ ప్రభుత్వం నెలరోజుల్లో కూలిపోతుందని రాజగోపాల్​ రెడ్డి జోస్యం చెప్పారు.



  Bandi Sanjay: ఏ స్కాంలోనైనా KCR కుటుంబం ఉంటుంది.. : బండి సంజయ్​ 


  అంతకుముందు మాట్లాడిన రాజగోపాల్​ రెడ్డి..  మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్‌ పోటీచేసినా విజయం తనదేనని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ నియంత పాలనను అంతమొందించేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానన్నారు.


  Komati Reddy: కేసీఆర్​ ఆ పని చేయకపోతే రక్త పాతం తప్పదు.. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హెచ్చరిక


  కేసీఆర్‌ కుటుంబసభ్యులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని, ఇప్పటికే ఆయన కుమార్తె కవిత లిక్కర్‌ కేసులో దొరికిపోయారన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు, అల్లుడిని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలో జైలుకు పంపి తీరుతారని హెచ్చరించారు

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Komatireddy rajagopal reddy, Munugodu By Election, Trs

  ఉత్తమ కథలు