నైరుతి పలకరించింది...

news18india
Updated: June 7, 2018, 1:54 PM IST
నైరుతి పలకరించింది...
బీహార్ ప్రభుత్వం జిల్లాల వారీగా వివరాలను ప్రకటించింది. అత్యధికంగా గోపాల్ గంజ్ (13) మంది చనిపోయారు.
  • Share this:
 

వాన జల్లు పలకరింపు కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నలకు శుభవార్త. ఇప్పటికే రాయలసీమ, కోస్తాలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాలను తాకిన నైరుతి పవనాలు, నేటి సాయంత్రం నాటికల్లా తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల చిరు జల్లులతో కూడిన తేలికపాటి జల్లులు కురిశాయి. సరైన సమయానికి నైరుతి పలకరింపుతో రైతుల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి.

మహారాష్ట్ర నుంచి కేరళ తీరందాకా వ్యాపించిన రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. జూన్ 7 నాటి సాయంత్రం కల్లా తెలంగాణ, రాయలసీమ, కర్ణాటకల్లోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాక కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చేపల కోసం వేటకి వెళ్లే జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

రాత్రి కురిసిన నగరానికి నగర జీవనం అతలాకుతలం అయ్యింది. మల్కాజిగిరి ప్రాంతంతో పాటు నగరంలోని మరికొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. ఇళ్లలోని నీళ్లు చేరడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. చెట్లు విరిగి పడడం వల్ల చాలాప్రాంతాల్లో విద్యుత్ సరాఫరాకి అంతరాయం కలిగింది. వర్షాకాలం ఆరంభానికి ముందే పరిస్థితి ఇలా ఉంటే, వర్షాలు మొదలయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందోనని హైదరబాదీలు తెగ గాబరా పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరుచుకున్న కారణంగా వర్షాల కారణంగా ఇబ్బందులు పెరగకముందే అధికారులు తగిన చర్యలు చేపట్టాలని నగరజనాలు డిమాండ్ చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా భద్రాద్రి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వేసవిలో నీళ్లు లేక బోసిపోయిన గోదావరి ప్రవాహం కొత్త కాంతులతో కనిపించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో పిడుగు పడిన ప్రమాదంలో ఓ రైతు చనిపోగా, మరో రైతు తీవ్ర గాయలకు గురయ్యాడు.

rains in mumbai
వర్షానికి నీట మునిగిన వాహనాలు


దేశరాజధాని న్యూఢిల్లీలోనూ, వాణిజ్య రాజధాని ముంబై నగరంలోనూ బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాలు వర్షం నీటితో మునిగిపోయాయి.ముంబైలో వరదలు వచ్చే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తగా తక్షణ సహాయం అందించేకు 6 రక్షణ బృందాల‌ను ఏర్పాటుచేశారు. ముంబైవాసులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా బీచ్ ప్రాంతాలకు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
Published by: Ramu Chinthakindhi
First published: June 7, 2018, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading