తెలంగాణకు వర్ష సూచన... రాబోయే రెండు రోజుల్లో...

ఈస్ట్ చంపారన్ (5), సివాన్ (6), దర్భంగా (5), బాకా (5), భగల్ పూర్ (6), ఖగారియా (3), ముధుబని (8), వెస్ట్ చంపారన్ (2), సమస్తిపూర్ (1), షాపోర్ (1), కిషన్ గంజ్ 92), సారన్ (1), జహనాబాద్ (2), సీతామర్హి (1), జుమై (2), నవాడా (8), పూర్ణై (2), ఔరంగాబాద్ (3), బుక్సర్ (2), కైమూర్ జిల్లాలో (1) చనిపోయారు.

దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది.

  • Share this:
    తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో... తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఈ ప్రభావాలతో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బహుదూర్‌పుర, రాజేంద్రనగర్‌తో పాటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లలో మూడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

    ఇక రాబోయే రెండో రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి వెల్లడించారు. గురువారం అక్కడక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. దీంతో ఓ వైపు భానుడి వేడితో పాటు వర్షతాకిడి కూడా తెలంగాణలో కొనసాగనుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: