హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణలోని పలు జిల్లాలో రేపు, ఎల్లుండి వర్ష సూచన...

తెలంగాణలోని పలు జిల్లాలో రేపు, ఎల్లుండి వర్ష సూచన...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగండ్లతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

    హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగండ్లతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అక్కడక్కడ ఉరుములు, వడగండ్లు, ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, గురువారం అక్కడక్కడ ఉరుములు, మెరు పులు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర దానిని ఆనుకొని ఉన్న విదర్భ ప్రాంతాల్లో 1.5 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొన సాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ మధ్యప్రదేశ్ దానిని ఆనుకొని ఉన్న విదర్భ నుంచి తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా 1.5 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Rain alert, Telangana

    ఉత్తమ కథలు