హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Rains: తెలంగాణలో గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం కురిసిన ప్రాంతాలివే..

Telangana Rains: తెలంగాణలో గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం కురిసిన ప్రాంతాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొద్దిరోజులుగా తెలంగాణ లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అయితే వర్షాలకు చిగురుటాకు లా వణికిపోతున్నది. కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నమోదైన వర్షపాతం వివరాలు..

 • News18
 • Last Updated :

  గడిచిన పదిహేను, ఇరవై రోజుల నుంచి తెలంగాణ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్ అయితే.. వర్షాలకు చిగురుటాకు లా వణికిపోతున్నది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రి తేడా లేకుండా వర్షం ఏకదారగా కురుస్తూనే ఉన్నది. అయితే గడిచిన 24 గంటల్లో తెలంగాణ లో నమోదైన వర్షపాతం వివరాలు కింది విధంగా ఉన్నాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం ఎక్కువే నమోదైంది. గద్వాల జిల్ల లోని లీజా మండలంలో 73 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

  గద్వరా జిల్లాలోనే మల్డకల్ జిల్లాలో 67.3 మి.మీలు, నాగర్ కర్నూలు లో 59.5 మి.మీ ల వర్షం కురవగా.. వనపర్తిలోని గోపాల్పేట లో 49 మి.మీల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో 32 మి.మీ కురిసింది.  ఇక హైదరాబాద్ లోనూ బుధవారం నగరమంతా అక్కడక్కడ వర్షం కురిసింది. అత్యధికంగా కాప్రా సర్కిల్ లోని కీసర మండలంలో 9 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపంది. కాప్రా సర్కిల్ లోనే ఉప్పల్ లో చిల్కానగర్ ప్రాంతంలో 4.3 మి.మీలు, మల్కాజిగిరి లో మౌలాలి ప్రాంతంలో 3.8 మి.మీ ల వాన పడింది.


  మంగళవారం దాకా నగరంలో విస్తృతంగా కురిసిన వర్షాలు బుధవారం కొంత వెనక్కి తగ్గాయి ఎల్బీనగర్ పరిదిలో నిన్న 2.3 మి.మీ ల వర్షం కురవగా.. హయత్ నగర్, బేగంపేట, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్ లలో 1.3 లోపే వర్షపాతం నమోదైంది.

  కాగా, ఐదు రోజుల పాటు నగరంలో వర్షాలు కురుస్తాయనే వాతవారణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించింది. అంతేగాక పాత, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఉన్నవారు కూడా అవి ఖాళీ చేయాలని సూచించింది.


  నగరంలో వరద బాధితులకు సహయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. భాగ్యనగరంలో వరదలతో ప్రభావితమైన ప్రజలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Hyderabad Floods, Hyderabad Heavy Rains, HYDERABAD RAIN, Telangana

  ఉత్తమ కథలు