నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు..

రాయలసీమలో ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

పంట చేతికొచ్చే సమయంలో రైతులకు ఇది చేదువార్తే. తెలంగాణలో అకాల వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాబోయే నాలుగు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

  • Share this:
    పంట చేతికొచ్చే సమయంలో రైతులకు ఇది చేదువార్తే. తెలంగాణలో అకాల వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాబోయే నాలుగు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, కర్ణాటక నుంచి మరాఠ్వాడా వరకు, ఉత్తర కర్ణాటక, మధ్య మహారాష్ట్ర మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయే క్యుములోనింబస్ మేఘాలు ఈ వేసవిలో ఏర్పడతాయని స్పష్టం చేసింది. అటు.. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం కూడా పలు జిల్లాల్లో చిరుజల్లులు పడ్డాయి.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: