హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆస్పత్రి ఐసీయూలోకి చేరిన వరద నీరు..

మురికి నీళ్లన్నీ ఆస్పత్రిలోకి చేరడంతో పేషెంట్స్‌కి ఎక్కడ ఇన్‌ఫెక్షన్స్ సోకుతాయోనని వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. వర్షపు నీటిని ఆస్పత్రి సిబ్బంది బకెట్లతో బయటకు ఎత్తిపోశారు.

news18-telugu
Updated: October 6, 2019, 7:01 PM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆస్పత్రి ఐసీయూలోకి చేరిన వరద నీరు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 6, 2019, 7:01 PM IST
హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
కుత్బుల్లాపూర్ పరిధిలో ఉన్న మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలోకి వర్షం నీళ్లు చేరాయి. ఐసీయూ సెల్లార్‌లోనే ఉండటంతో రోగులు,వైద్యులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఐసీయూలోకి నీరు రావడంతో భయాందోళనకు గురైనట్టు రోగుల బంధువులు తెలిపారు. మురికి నీళ్లన్నీ ఆస్పత్రిలోకి చేరడంతో పేషెంట్స్‌కి ఎక్కడ ఇన్‌ఫెక్షన్స్ సోకుతాయోనని వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. వర్షపు నీటిని ఆస్పత్రి సిబ్బంది బకెట్లతో బయటకు ఎత్తిపోశారు.అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో 7.8సెం.మీ వర్షం నమోదైంది. అల్విన్ కాలనీలో 6.6సెం.మీ,అంబర్‌పేట్‌లో 5.9సెం.మీ వర్షపాతం నమోదైంది.మధ్యాహ్నం కురిసిన వర్షానికి సోమాజిగూడ,బేగంపేట్,సికింద్రాబాద్,ఖైరతాబాద్,బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.


First published: October 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...