తెలంగాణ ( Telangana ) జిల్లాలో పలు చోట్ల వర్షం కురుస్తుండడతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఒకపక్క పగటి ఉష్ణొగ్రతలు పడిపోయి చల్లటి గాలులు వీస్తూ జనాలను వణికిస్తుంటే గత రెండు రోజులుగా అకాల వర్షం హడలెత్తిస్తోంది. తెల్లవారుజాము నుండే మబ్బులు ఆవరించి వాతావరణాన్ని చల్లబరుస్తున్నాయి. దీనికి తోడు చల్లటి గాలులు, సాయంత్రం పూట వర్షం తోడవడంతో చలి తీవ్రత పెరిగి గుబులు రేపుతోంది.
ఈ క్రమంలోనే ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లాలోని పలు మండలాల్లో గత రెండు రోజుల్లో వడగళ్ళ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని మండలాల్లో తేలికపాటి జల్లులు కురిస్తే, మరికొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షాపాతం ( Rain ) నమోదైంది. మరికొన్ని చోట్ల వడగళ్ళతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాలో ( Power cut ) అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, నార్నూర్, ఇంద్రవెల్లి, భీంపూర్ మండలాలతోపాటు ఇంకా పలు మండలాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. మరో వైపు ఈ వర్షం రైతుల్లో ( farmers ) గుబులు రేపుతోంది. ముఖ్యంగా కోత దశలో ఉన్న కంది పంట, విక్రయానికి సిద్దం చేసిన పత్తి పంటకు నష్టవాటిల్లే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.