తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. పలుచోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. వేసవికి ప్రారంభంలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. అయితే తెలంగాణకు రానున్న మూడు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి కారణంగా రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం విదర్భ పరిసర ప్రాంతాలకు ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురువొచ్చని తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే రాష్ట్రంలో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. మరోవైపు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లూరులో 38.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.