హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదైనా, మేఘాల ప్రభావం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

news18-telugu
Updated: December 31, 2019, 10:19 AM IST
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
  • Share this:
హైదారాబాద్‌లో వాతావరణం అత్యంత చల్లగా మారింది. పలు చోట్ల ఇవాళ వర్షం కురిసింది. దీంతో ఓ వైపు చలి, మరోవైపు వర్షంతో భాగ్యనగరవాసులు వణుకుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం స్కూళ్లకు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వారు చల్లటి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు అటు ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో... కోస్తాంధ్ర జిల్లాలో వానలు కురుస్తున్నాయి. రెండు రోజలు పాటు వర్షాలు పడుతాయని విశాఖ వాతావరణ వాఖ అధికారులు చెబుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదైనా, మేఘాల ప్రభావం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, తేమగాలులు వీస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో చలి పెరిగిందని తెలిపారు అధికారులు.
Published by: Sulthana Begum Shaik
First published: December 31, 2019, 10:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading