Rain alert: తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన

ఏపీలోనూ వర్షాలు పడతాయని అమరావతది వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

news18-telugu
Updated: August 27, 2020, 8:20 AM IST
Rain alert: తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇటీవల వారం పది రోజుల పాటు వరుసగా వానలు పడడంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లి.. ప్రాజెక్టులన్నీ కళకళలాడాయి. గత మూడు రోజులుగా పొడి వాతవరణమే కనిపించింది. ఐతే ఇవాళ్టి నుంచి మళ్లీ వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో నేడు భారీగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. అంతేకాదు రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలుల ద్రోణి వ్యాపించి ఉంది. ఇక రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఏపీలోనూ వర్షాలు పడతాయని అమరావతది వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Published by: Shiva Kumar Addula
First published: August 27, 2020, 8:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading