తెలంగాణలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. నదులు మహోగ్రరూపం దాల్చాయి. జలాశయాలు నిండుకుండల్లా మారడంతో గేట్లు తెరచుకున్నాయి. ఎడతెరిపి లేని వానలకు చెరువు కట్టలు కూడా తెగిపోతున్నాయి. ఇప్పటికే ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజులు పాట వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వివరాల ప్రకారం.. తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవార్తనం కొనసాగుతోంది. మరో వైపు కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లోనూ దాదాపు మూడు కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈశాన్య బంగాళాఖాతంలోనూ ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
వీటి ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా వానలు కురిసే అవకాశముందని, పలు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, రూరల్, మహమూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్నగర్, గద్వాల జోగులాంబ, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, కుమ్రంభీమ్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాపాతం నమోదయింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.