Home /News /telangana /

RAIN ALERT FOR TELANGANA TAKE PRECAUTIONS AND DETAILS EVK

Rain Alert: మ‌బ్బులు ప‌ట్టిన ఆకాశం.. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వ‌ర్ష సూచ‌న‌.. జాగ్ర‌త్త‌లు పాటించండి

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

తెలంగాణ (Telangana)లో ఈరోజు వాతావ‌ర‌ణం మ‌బ్బు ప‌ట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది. చాలా చోట్ల సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం వెల్లడిం చిం ది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ (Telangana)లో ఈరోజు వాతావ‌ర‌ణం మ‌బ్బు ప‌ట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది. చాలా చోట్ల సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం వెల్లడిం చిం ది. రేపు, ఎల్లుం డి మాత్రం తేలికపాటి నుం చి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్ల‌డించారు. రాష్ట్రానికి ఈశాన్య ప్రాంతం నుంచి తెలిక‌పాటి గాలులు వీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉండ‌గా.. కొన్ని చోట్ల ఉరుములు మెరుపుల‌తో జ‌ల్లులు కురిసే అవ‌కాశం ఉంది. ఉత్తర తమిళనాడు (Tamil Nadu) ప్రాంతంలో కొన‌సాగుతున్న‌ అల్ప పీడనం ఈరోజు ఉదయం 5.30 గంటలకు బలహీనపడింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ప‌లు చోట్ల వ‌ర్షాలు ప‌డ‌తాయి.

    వాయుగుండం గా బలపడే అవకాశం..
    రాష్ట్రంలోకి తెలిక‌పాటి గాలులు దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని.. దీని కారణంగానే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావ‌ర‌ణ అధికారులు తెలిపారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని..వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని అనుబం ధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 3.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోం దన్నా రు.

    TCS Recruitment 2021 : ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్‌.. TCS జాబ్స్ ద‌ర‌ఖాస్తుకు గడువు పొడిగింపు


    దక్షిణ అం డమాన్ సముద్రం దాని పరిసర థాయిలాండ్ తీర ప్రాం తాల్లో మరొక అల్ప పీడనం ఈరోజు ఉదయం 8.30 గం టలకు ఏర్పడిందని ప్రకటించారు. దీని అనుబం ధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోం దని తెలిపారు. ఇది పశ్చి మ- వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 15న వాయుగుండం గా బలపడే అవకాశం ఉం దని వివరించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

    జాగ్ర‌త్త‌లు పాటించాలి..
    రాష్ట్రాల్లో మ‌ళ్లీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున సీజనల్ వ్యాధులు వస్తాయి. వాతావరణంలో మార్పులు వల్ల మన శరీరంలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. సీజన్‌ను బట్టి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఏ సీజన్ లో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఆ సీజన్ లో తీసుకోవాలి. ఎండాకాంలో వడదెబ్బ బారిన పడుతూ ఉంటాం. వర్షాకాలంలో జ్వరం, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.
    - వ‌ర్షాలు ప‌డే స‌మ‌యంలో చాలా మందికి మెటిమలు, మచ్చల సమస్య ఎక్కువగా ఉంటుంది.
    - మంచినీళ్లు ఎక్కువగా తాగడం వల్లన మెటిమలు, మచ్చలు తగ్గుతాయి.
    - వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మ సమస్యల నుంచి సులువుగా బయపడవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
    - అంతే కాకుండా వ‌ర్షాలు ప‌డే స‌మ‌యంలో నీళ్లు కాలుష్యమయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే గొరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Rain alert, Telangana

    తదుపరి వార్తలు