Yadadri: యాదాద్రి రైల్వే స్టేషన్.. పేరు మార్చిన దక్షిణ మధ్య రైల్వే

Yadadri Railway Station: సికింద్రాబాద్, కాజీపేట్ సెక్షన్ మధ్యలో ఉండే రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మారుస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది.

news18-telugu
Updated: September 21, 2020, 11:11 PM IST
Yadadri: యాదాద్రి రైల్వే స్టేషన్.. పేరు మార్చిన దక్షిణ మధ్య రైల్వే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి అతి సమీపంలో ఉండే రాయగిరి రైల్వే స్టేషన్‌ ఇకపై యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మారనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్, కాజీపేట్ సెక్షన్ మధ్యలో ఉండే రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మారుస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 18 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే తన ప్రకటనలో పేర్కొంది. యాదాద్రికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే రాయగిరి రైల్వే స్టేషన్‌కు యాదాద్రి పేరు పెట్టాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.

ఇక రైల్వే స్టేషన్ పేరు మార్చడంతో పాటు కేవలం మూడు నాలుగు రైళ్లు మాత్రమే ఆగే ఈ స్టేషన్‌లో మరిన్ని రైళ్లను ఆపాలని గతంలో అనేక మంది డిమాండ్ చేశారు. ఇక హైదరాబాద్‌ ప్రజలకు సేవలందించే ఎంఎంటీఎస్ రైళ్లను యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు పొడిగించే ప్రతిపాదన కూడా చాలాకాలం నుంచి ఉంది.
Published by: Kishore Akkaladevi
First published: September 21, 2020, 11:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading