హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : వరి ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ ట్వీట్.. నిజాయితీ ఉంటే.. ఎంపీలకు మద్దతు...అంటూ

Telangana : వరి ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ ట్వీట్.. నిజాయితీ ఉంటే.. ఎంపీలకు మద్దతు...అంటూ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై జాతీయ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ క్రమంలోనే రెండు ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలులో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకుండా రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టె రైతులను క్షోభపెట్టే పనులు మానుకోవాలని హితవు పలికారు. దీంతో పాటు రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేసేవరకు కాంగ్రెస్ పార్టీ రైతుల తరపున పోరాటం చేస్తుందని అన్నారు.

అయితే రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.. ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ రాజకీయ లబ్ధికోసం ట్విట్టర్‌లో సంఘీబావం తెలిపడం కాకుండా పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయాలని ఆమె కోరారు. ఈ క్రమంలోనే పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంపీలు పార్లమెంట్ వెల్‌లోకి వెళ్లి తమ నిరసన తెలుపుతున్నారని, రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిలవాలని ఆమె డిమాండ్ చేశారు.

మరోవైపు వరి ధాన్యం కొనుగోలుకు సంబందించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాటు పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. పార్టీ ఆందోళనల్లో భాగంగా శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా వేసింది. పార్టీ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో రాహుల్ గాంధీ సైతం పాల్గొననున్నట్టు పార్టీ నేతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే తెలంగాణ రైతుల ఆందోళనను అర్ధం చేసుకుని తమ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.

First published:

Tags: Rahul Gandhi, Telangana

ఉత్తమ కథలు