Home /News /telangana /

RAGHUNANDAN RAO SWEARING AS DUBBAKA MLA ON NOVEMBER 18TH SU

Raghunandan Rao: రఘునందన్‌రావు ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు..

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్‌రావు ప్రమాణ స్వీకరానికి ముహుర్తం ఖరారైంది

    .దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్‌రావు ప్రమాణ స్వీకరానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 18న మధ్యాహ్నం ఒంటి గంటకు రఘునందన్‌రావు దుబ్బాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో నిలిచిన రఘునందన్‌రావు విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి రౌండ్ వరకు పోటాపోటీగా జరిగిన పోరులో 1,079 ఓట్ల మెజారిటీతో రఘునందన్‌రావు గెలుపొందారు.

    దుబ్బాకలో బీజేపీ విజయం ఆ పార్టీ నేతల్లో కొత్త జోష్‌ను నింపింది. రానున్న జీహెచ్‌ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే జోరును కొనసాగించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార సమయంలో సిద్దిపేటలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలంటూ ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన సన్నిహితుల ఇళ్లలో 18.67 లక్షల రూపాయలు దొరికాయని పోలీసులు కట్టుకథ అల్లారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే రఘునందన్‌రావు పిటిషన్ హైకోర్టులో విచారణకు రాగా.. ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసం విచారణ జరపాల్సి ఉంటుందని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తెలిపింది. రఘునందన్‌రావు పిటిషన్‌ను సీజే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి సూచించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Dubbaka By Elections 2020, Raghunandan rao

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు